త్రిష-ఇలియానా-నయనతార.. ఇక జెనీలియా

Update: 2016-09-29 01:30 GMT
హీరోయిన్ జెనీలియా తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే.. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసేసుకుని సెటిల్ అయిపోయింది. రీసెంట్ గా అమ్మ కూడా అయిన జెన్నీ.. ఇప్పడు మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా జెనీలియాకు బోలెడంతమంది అభిమానులు ఉన్నారు. తనకు నచ్చిన పాత్ర ఆఫర్ అక్కడి నుంచి రావడంతో.. జెన్నీ కోలీవుడ్ నుంచి రీఎంట్రీ ఇకచ్చేందుకు సిద్ధమైంది. త్రిష-ఇలియానా-నయనతార అంటూ సినిమా టైటిల్ తోనే సందడి చేసిన హీరో కం కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కే చిత్రంతో జెన్నీ రీ ఎంట్రీ ఖాయమైందని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యూస్టీ - కడవుల్ ఇరుక్కాన్ కుమారు చేస్తున్న జీవీ.. దిల్లుకు దిడ్డు ఫేమ్ రామ్ బాలాతో త్వరలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా నటించేందుకు జెనీలియా అంగీకరించిందిట.

ఉన్న హీరోయిన్లకే సరైన ఆఫర్స్ రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్న టైమ్ లో.. రీఎంట్రీలోనూ జెనీలియాకి హీరోయిన్ ఆఫర్ రావడం చెప్పుకోదగ్గ విషయమే. అయితే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ పెండింగ్ లో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News