• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ తో సినిమా నా...

సూపర్ స్టార్ తో సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్...!

By - Tupaki Desk
Update: 2020-04-30 08:10 GMT
సూపర్ స్టార్ మహేష్‌ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. దీంతో తన కెరీర్లో 27వ చిత్రాన్ని పరశురామ్‌ దర్శకత్వంతో చేయనున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్, ఎంబీ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమాని గ్రాండ్‌ గా ప్రారంభించనున్నారని సమాచారం. మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ.. బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే సూపర్ స్టార్ మహేష్ ఎంతో మంది స్టార్ డైరెక్టర్లని పక్కన పెట్టి మరీ పరశురామ్ కి ఎందుకు అవకాశమిచ్చాడనేది సినీ అభిమానుల మదిలో ఉన్న ప్రశ్న. అయితే మహేష్ - పరశురామ్ కాంబో వెనుక పెద్ద కథే ఉందంట.

ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన పరశురామ్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో చేయనున్న సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. పరశురామ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి మహేష్ బాబే కారణమట. సూపర్ స్టార్ మహేష్ నటించిన 'ఒక్కడు' సినిమా 2003లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 'ఒక్కడు' సినిమా వచ్చి 17 సంవత్సరాలు అవుతోంది. అయితే పరశురామ్ ఈ సినిమా చూసే ఇండస్ట్రీలో తన లక్ పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఆయన సినిమా చూసి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తనకి అదే హీరోని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మహేష్ తో సినిమా అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ ఏమేమి కోరుకుంటారో అన్ని అంశాలు ఉండేలా స్టోరీ రెడీ చేసి మహేష్ బాబుని ఒప్పించాడట ఈ టాలెంటెడ్ డైరెక్టర్.

'గీత గోవిందం' లాంటి విజయవంతమైన సినిమా తర్వాత కూడా ఇన్నేళ్లు వెయిట్ చేసి మహేష్ తో సినిమా చేస్తున్నాడు పరశురామ్. ఎలివేషన్ సీన్స్ మరియు కమర్షియల్ గూస్ బమ్స్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ గురించి ఫ్యాన్స్ కంగారు పడవలసిన అవసరం లేదని.. నాకు అలాంటివి తీయడం రాక కాదు, ఇప్పటి దాకా నా సినిమాల్లో వాటికి అవకాశం లేక పోవడం వల్లనే కుదరలేదని చెప్పుకొచ్చాడు. నిజానికి మహేష్ బాబు - పరశురామ్ కాంబో గురించి ఇప్పటి వరకు అటు మహేష్ నుండి కానీ ఇటు నిర్మాతల నుండి గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పరశురామ్ అనౌన్స్ చేయడంతో కన్ఫర్మేషన్ వచ్చినట్లైంది.
Tags:    
  • Geetha Govindam director confirms a movie with Mahesh 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS