• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చ‌ర‌ణ్‌ తో కాదు.. మ‌ళ్లీ...

చ‌ర‌ణ్‌ తో కాదు.. మ‌ళ్లీ నానితోనే!

By - Tupaki Desk
Update: 2016-11-01 04:04 GMT
గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఎప్ప‌ట్నుంచో ప్ర‌చారం సాగుతోంది. ఒక‌ట్రెండుసార్లు చ‌ర‌ణ్ కూడా గౌత‌మ్‌తో చేయాల‌నుంద‌ని చెప్పాడు. కానీ  చ‌ర‌ణ్ ఖాళీగా ఉన్న‌ప్పుడు గౌత‌మ్ బిజీగా ఉండ‌టం - గౌత‌మ్ ఖాళీగా ఉన్న‌ప్పుడు చ‌ర‌ణ్ ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటుండ‌డంతో వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా సాధ్యం కాలేదు.  గౌత‌మ్ మీన‌న్ సినిమా చేస్తే అది రెండు భాష‌ల్లో వ‌ర్క‌వుట్ అయ్యేలా ఉండాల‌నుకొంటాడు. ఏమాయ చేసావె - ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు - సాహ‌సం శ్వాస‌గా సాగిపోలాంటి సినిమాల త‌ర‌హాలో ఇటు తెలుగు - అటు త‌మిళం భాష‌ల్లో తెర‌కెక్కిస్తుంటాడు. ఆ త‌ర‌హాలో చిత్రాల్ని తెర‌కెక్కించాలంటే  కాస్త ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. రామ్‌ చ‌ర‌ణ్‌ లాంటి స్టార్ క‌థానాయ‌కులు ఒక సినిమా కోసం ఎక్కువ రోజులు స‌మ‌యం కేటాయించ‌లేరు. అందుకే ఆ కాంబినేష‌న్ల‌లో సినిమాలు తెర‌కెక్క‌డం క‌ష్టం అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతుంటాయి.

అయితే గౌత‌మ్ మీన‌న్ తాజాగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకొన్నాడు. తెలుగు - త‌మిళం భాష‌ల్లో మార్కెట్టున్న నానితోనే మ‌రో సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఆ సినిమా ఒక డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌ తో తెర‌కెక్క‌బోతోంద‌ని తెలుగు మీడియాతో స్ప‌ష్టం చేశాడు గౌత‌మ్ మీన‌న్‌. నాని కూడా తమిళంలో సినిమా చేయ‌క చాలా రోజులైంది. అందుకే గౌత‌మ్ మీన‌న్ సినిమా అన‌గానే ఓకే చెప్పేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఆ ప్రాజెక్టు గురించి అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలున్నాయి. ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు త‌ర్వాత గౌత‌మ్ మీన‌న్‌ - నాని క‌లుస్తుండ‌డంతో ఆ ప్రాజెక్టుపై తెలుగు - త‌మిళ భాష‌ల్లో ఆస‌క్తి నెల‌కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Gautham Menon 
  • Nani 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS