సెంచరీతో మోత మోగించేసిన శాతకర్ణి

Update: 2016-12-16 16:37 GMT
ఈ వారం టాలీవుడ్ లో పెద్ద సినిమాలేమీ రిలీజ్ కాలేదు. ఐదు మూవీస్ థియేటర్లలోకి వచ్చినా.. అవేమీ బాక్సాఫీస్ ని.. అభిమానులను షేక్ చేసే రేంజ్ ఉన్నవి కాదు. కానీ ఈ శుక్రవారం రాష్ట్రం మొత్తం ఓ ఉత్సవంలా ఊగిపోయింది. నందమూరి అభిమానుల్లో పండుగ వాతావరణం కనిపించింది. ఇందుకు కారణం వంద థియేటర్లలో గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ప్రదర్శించడమే.

రెండు రాష్ట్రాల్లోను కలిపి 100 స్క్రీన్లలో ప్రదర్శించారు. అన్ని చోట్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య చెప్పిన డైలాగ్స్.. సింహంలా పలికిన మాటలు.. అదిరిపోయే విజువల్స్.. ప్రేక్షకులను.. నందమూరి అభిమానులను ఉర్రూతలూగించాయి. దేశాన్ని రక్షించే బాథ్యతలు తీసుకున్న అమరావతి చక్రవర్తి శాతకర్ణిగా బాలకృష్ణ నటనకు.. అదిరిపోయే అప్లాజ్ వచ్చింది. జై  బాలయ్య నినాదాలతో అన్ని ఏరియాస్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక పెద్ద పెద్ద బ్యానర్లు.. కటౌట్లతో బాలయ్య ఫ్యాన్స్ పండుగ వాతావరణం తీసకొచ్చేశారు. కరీంనగర్ లో శాతకర్ణి టీం అఫీషియల్ గా ట్రైలర్ రిలీజ్ చేసినా.. హైద్రాబాద్ లో భ్రమరాంబ థియేటర్ లో అనిల్ సుంకర.. శ్రీవాస్ లు సందడి చేశారు. సహజంగా సినిమాలు సెంచరీతో ఫినిషింగ్ చేసుకుంటాయి. కానీ బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం సెంచరీతో చరిత్ర ప్రారంభించినట్లు అనిపించడంలో ఆశ్చర్యం లేదు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News