గ్యాంగ్ స్ట‌ర్ వ‌ర్సెస్ ఠ‌ఫ్ కాప్.. వేస‌విలోనే వార్ స్టార్ట్!

Update: 2021-03-27 17:30 GMT
త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ విక్ర‌మ్ వేద హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో న‌టించేందుకు అంగీక‌రించార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. క్రిటిక‌ల్ గా ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ రీమేక్ లో తొలుత అమీర్ ఖాన్ న‌టిస్తున్నార‌ని ప్ర‌చారమైనా ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు.

ఇ‌పుడు అమీర్ స్థానంలో హృతిక్ రోషన్ నటించనున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఈ వేస‌వి నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే హృతిక్ రోష‌న్ స్క్రిప్ట్ విని ఓకే చేశారు. గ్యాంగ్ స్ట‌ర్ రోల్ కోసం ప్రిప‌రేష‌న్ ప్రారంభించారు. ఈ పాత్ర కోసం కొంత బ‌రువు పెరిగే వీలుంద‌ని కూడా చెబుతున్నా.. హృతిక్ జిమ్ లో అవ‌స‌రం మేర క‌స‌ర‌త్తులు స్టార్ట్ చేశార‌ని తెలిసింది.

ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నారు. హృతిక్ వ‌ర్సెస్ సైఫ్ న‌డుమ వార్ ఆద్యంతం ఆస‌క్తిని క‌లిగించేలా తీర్చిదిద్ద‌నున్నార‌ని తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభమవుతుంది. మిగిలిన తారాగణం సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. హృతిక్ చివరిసారిగా 2019 యాక్షన్ థ్రిల్లర్ వార్ లో కనిపించాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న‌ ఫైటర్ చిత్రంలో నటిస్తున్నారు.

పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహించిన విక్రమ్ వేదలో మాధవన్- విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించ‌గా మాధ‌వ‌న్ పాత్ర‌లో  హృతిక్ న‌టించేందుకు అంగీక‌రించ‌డంతో ఈ రీమేక్ ప్రాజెక్ట్ పై ఆస‌క్తి నెల‌కొంది.
Tags:    

Similar News