మదర్స్ డే సెలబ్రేషన్.. సెలబ్రిటీలంతా ఒకే మాట!

Update: 2020-05-11 07:30 GMT
నిన్న సోషల్ మీడియా అంతా మదర్స్ డే సందేశాలతో నిండిపోయింది. సాధారణ నెటిజెన్లు మాత్రమే కాదు దాదాపుగా సెలబ్రిటీలు అందరూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ఫ్లాష్ బ్యాక్ ఫోటోలు పోస్ట్ చేయగా.. కొందరేమో కొత్త ఫోటోలు.. వీడియోలతో అమ్మతో ఉన్న అనుబంధం గురించి అందరితో పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఒక బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేసి మరీ  అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మరో వీడియోలో లేడీ పోలీస్ ఓ మతి స్థిమితం లేని మహిళకు ఆహారం అందించడం.. దగ్గరుండి అమ్మలాగా తినిపించడం తనను ఎంతో కదిలించిందని వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన అమ్మగారు ఇందిర గురించి.. సతీమణి నమ్రత గురించి ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.  సమంతా అయితే తన అమ్మగారు నినెట్ ప్రభు.. అత్తగారు లక్ష్మి దగ్గుబాటిలతో ఉన్న ఫోటో పోస్ట్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. మదర్స్ డే అనగానే అమ్మే అనుకుంటాం కానీ అత్త కూడా అమ్మే అని అత్తమ్మ అనే సందేశాన్ని పరోక్షంగా ఇవ్వడం విశేషం.  ఇంకా చాలామంది ఫిలిం స్టార్స్ మదర్స్ డే సందేశాలలో  భాగస్వామ్యులయ్యారు.

ఇదిలా ఉంటే సచిన్ టెండూల్కర్ తన అమ్మగారితో ఉన్న చిన్నప్పటి ఫోటో పోస్ట్ చేసి మదర్స్ డే శుభా కాంక్షలు తెలిపారు.  అంతే కాకుండా నిన్న ఎంతోమంది కోవిడ్ -19 ను అరికట్టే చర్యల్లో భాగంగా డ్యూటీ చేస్తున్న మహిళలతో ఆన్లైన్ లో మాట్లాడారు.. వారిని ప్రశంసించారు.  

మదర్స్ డే సెలబ్రేషన్.. టచింగ్ అంతే!
Tags:    

Similar News