• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాధిక ఆప్టే 'ఫోరెన్సిక్'...

రాధిక ఆప్టే 'ఫోరెన్సిక్' ట్రైలర్: ఉత్కంఠభరితంగా సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్..!

By - Tupaki Desk
Update: 2022-05-21 06:30 GMT
బాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ సినిమాల హడావిడి కొనసాగుతోంది. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న మీడియం రేంజ్ హీరోల వరకూ అందరూ రీమేకుల బాట పడుతున్నారు. సౌత్ లో ఘనవిజయం సాధించిన కథలను హిందీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి ఫిలిం మేకర్స్. హిందీలో రీమేక్ అవుతున్న ఆసక్తికరమైన చిత్రాలలో ''ఫోరెన్సిక్'' కూడా ఒకటి.

మలయాళంలో మమతా మోహన్ దాస్ - టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ''ఫోరెన్సిక్''. అఖిల్ పాల్ & అనాస్ ఖాన్ దర్శకత్వం వహించిన బీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ గా నిలిచింది. 'ఆహా' ఓటీటీ ఈ చిత్రాన్ని అదే పేరుతో డబ్ చేసి తెలుగు ఆడియన్స్ కు అందించింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు.

బాలీవుడ్ స్టార్స్ రాధికా ఆఫ్టే మరియు విక్రమ్ మెస్సే ప్రధాన పాత్రల్లో హిందీ ''ఫోరెన్సిక్'' సినిమా తెరకెక్కింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 'జీ5' లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా టీజర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

ఓ బాలిక దారుణ హత్యకు గురికావడంతో ఈ టీజర్‌ ప్రారంభమవుతుంది. నగరంలో చిన్న పిల్లల కిడ్నాప్స్ మరియు మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అంతు చిక్కని ఈ మర్డర్ మిస్టరీని చేధించడానికి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ రాధికా ఆప్టే మరియు ఫోరెన్సిక్ నిపుణుడు విక్రమ్ మాస్సే రంగంలోకి దిగారు.

మిస్టరీని వెలికితీసి హంతకులను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరొక అమ్మాయి తప్పిపోయిందని తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. ఈ విషాదం వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి ఇద్దరూ లోతుగా పరిశోధిస్తున్నారు. అయితే కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొలదీ వారికి దిగ్బ్రాంతికి గురి చేసే విషయాలు బయటపడుతున్నట్లు టీజర్ ని బట్టి తెలుస్తుంది.

మర్డర్స్ వెనకున్న హంతకుడు ఎవరు? ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? రాధిక ఆప్టే అండ్ టీమ్ కిల్లర్ ని ఎలా పట్టుకుంది? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? అనేది తెలియాలంటే ''ఫోరెన్సిక్'' సినిమా చూడాల్సిందే. టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమాపై ఆసక్తి రెట్టింపు చేసేలా సాగింది. బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇందులో ఫోరెన్సిక్ నిపుణుడు జానీ ఖన్నా పాత్రలో మాస్సే.. పోలీస్ ఆఫీసర్ మేఘా శర్మ పాత్రలో రాధిక ఆప్టే ఆకట్టుకున్నారు. వీరితో పాటు ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ లో ప్రాచీ దేశాయ్ - విందు దారా సింగ్ మరియు రోహిత్ రాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

''ఫోరెన్సిక్'' చిత్రానికి 'క్రిమినల్ జస్టిస్' ఫేమ్ విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించారు. సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బగ్లా వరుణ్ బాగ్లా మరియు దీపక్ ముకుత్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ లను ఇష్టపడే వారిని 'ఫోరెన్సిక్' సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని టీజర్ చూసి చెప్పవచ్చు. ZEE5 ఓటీటీలో జూన్ 24 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మలయాళ - తెలుగు సినీ ప్రియులను మెప్పించిన ఈ సినిమా.. హిందీలో ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.


Full View
Tags:    
  • Bollywood 
  • Forensic 
  • movie 
  • trailer 
  • forensictrailer 
  • tupakinews 
  • latestnews 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS