స్టైలింగ్ లో స్టైలిష్ స్టార్ నే ఫాలో చేస్తున్నాడా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా దానిని అనుసరించేందుకు లక్షలాదిగా ఫాలోవర్స్ ఉన్నారు. బన్ని అభిమానులే కాదు సెలబ్రిటీల్లోనూ తన స్టైలింగ్ ని అనుకరించాలని ఆరాటపడే వాళ్లు లేకపోలేదు. కాస్ట్యూమ్స్.. హెయిర్ కట్ .. బాడీ షేపింగ్ వగైరా వగైరా విషయాల్లో బన్ని ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఇక అతడి డ్యాన్సులకు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ఆ స్టెప్పుల్ని ఇమ్మిటేట్ చేసేవాళ్లున్నారు.
ఇకపోతే స్టైలింగ్ విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్న హీరోల జాబితాలో ఇప్పుడు రామ్ పోతినేని పేరు వినిపిస్తోంది. ఈ టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకుని యువతరంలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసినదే. టాలీవుడ్ లోనే అల్ట్రా స్మార్ట్ హీరోగా అతడికి గాళ్స్ లో ఇమేజ్ ఉంది.
ఇకపోతే ఇటీవల రామ్ సింహం బొమ్మ లోగో ఉన్న స్టైలిష్ షర్ట్ తొడుక్కోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బన్నీని రామ్ ఫాలో చేస్తున్నారా? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఇటీవల అల్లు అర్జున్ ఎక్కడ చూసినా సింహం బొమ్మ లొగో ఉన్న షర్ట్స్ మాత్రమే వేసుకుంటున్నాడు.
నిహారిక వెడ్డింగ్ లో స్టైలిష్ స్టార్ ఈ బ్రాండ్ ష్టర్స్ వేసుకున్న ఫొటోలు బైటకు వచ్చాయి. అయితే ట్రెండ్ కి తగ్గట్లుగా స్టైలిష్ గా ఉండే స్టార్ హీరో బన్నీని మిగతా కుర్ర హీరోలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రామ్ మీద తాజాగా జరిగిన ఫొటో షూట్ ఈ బ్రాండ్ షర్టింగ్స్ లో కనిపించారు. అది కేవలం ఎంపిక చేసుకున్న బ్రాండ్ వల్లనే అలా అంతా భావించారనుకోవచ్చు.
ఇక బన్ని.. రామ్ ఎవరికి వారు ఎనర్జిటిక్ పెర్ఫామెన్సెస్ పరంగా డ్యాన్సుల పరంగా యూనిక్ స్టైల్ తో నవతరాన్ని అలరిస్తుంటారన్న సంగతి తెలిసినదే. రేసు గుర్రం ఒకరు అయితే ఇస్మార్ట్ శంకర్ ఇంకొకరు అన్నమాట.