పోకిరి, అర్జున్ రెడ్డి, బొమ్మరిల్లు స్పూఫ్‌లతో గాయపడ్డ సింహం సందడి!

తరుణ్ భాస్కర్ దర్శకుడిగానే కాకుండా నటుడుగా కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నారు.;

Update: 2026-04-29 11:14 GMT

తరుణ్ భాస్కర్ దర్శకుడిగానే కాకుండా నటుడుగా కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తున్న రాబోయే తెలుగు సినిమా గాయపడ్డ సింహం రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ప్రమోషన్స్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ మూవీ గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా స్పూఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఈ చిత్రంలో హైలైట్ గా నిలవనుంది అని వినికిడి.

ఈ సినిమాలో పోకిరి, అర్జున్ రెడ్డి, బొమ్మరిల్లు, అలాగే కేజీఎఫ్, సలార్ వంటి హిట్ సినిమాలపై స్పూఫ్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని సమాచారం. ఈ స్పూఫ్ సీన్స్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సెగ్మెంట్స్‌పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది.

సమ్మర్ సీజన్‌లో ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో నవ్వులతో నిండిన అనుభవాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ స్పూఫ్ సీన్స్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వినోదంతో పాటు కొత్తగా ఏదైనా చూపించాలని టీమ్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక కథ విషయానికి వస్తే, ఇది యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథగా తెరకెక్కింది. చిన్నప్పటి నుంచే హీరోకి అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ కావాలనే కల ఉంటుంది. కానీ ఆ కల నిజమయ్యే సమయానికి అనుకోని షాక్ ఎదురవుతుంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల వీసా సమస్యలు, డిపోర్టేషన్ ఇష్యూలు వస్తాయి.ఈ పరిస్థితుల్లో హీరో ఎలా స్పందించాడు? తనకు జరిగిన అన్యాయానికి ఎలా రివెంజ్ తీసుకున్నాడు? అన్నదే సినిమా కథ. అయితే ఈ రివెంజ్ డ్రామాను పూర్తిగా కామెడీ స్టైల్‌లో చూపించబోతున్నారు. దీంతో సినిమా ఒకేసారి వినోదం, మెసేజ్ రెండింటినీ అందించనుంది.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తుండగా, ఫరియా అబ్దుల్లా కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

Tags:    

Similar News