క్షమాపణలతో నిషేదం ఎత్తివేత

Update: 2019-08-22 05:09 GMT
ఇండియా పాకిస్తాన్‌ సంబంధాలు సరిగా లేని ఈ సమయంలో బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ మీకా సింగ్‌ పాకిస్తాన్‌ లో ముషారఫ్‌ బందువల ఇంట్లో జరిగిన ఒక వేడుకలో సంగీత కచేరి ఇవ్వడం తీవ్ర దుమారం రేపిన విషయం తెల్సిందే. భారతీయుల మనోభావాలను మీకా సింగ్‌ దెబ్బ తీశాడంటూ తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలోనే సినీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మీకా సింగ్‌ పై నిషేదం విధించింది. ఇకపై మీకా సింగ్‌ కు ఏ ఒక్కరు ఛాన్స్‌ ఇవ్వొద్దంటూ అల్టిమేటం జారీ చేయడం జరిగింది.

తనపై నిషేదం విధించడంపై స్పందించిన మీకా సింగ్‌ తాను చేసింది తప్పే అంటూ ఒప్పుకున్నాడు. నేను శిక్షకు అర్హుడినే అంటూ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ప్రతి ఒక్క దేశ పౌరుడికి తన క్షమాపణలు తెలియజేస్తున్నట్లుగా ఎమోషనల్‌ గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. తన తప్పును క్షమించాలని సినీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కు మీకా సింగ్‌ ఒక లేఖను కూడా రాయడం జరిగింది. అందులో క్షమాపణలు చెప్పడంతో పాటు తనపై విధించిన బ్యాన్‌ ను ఎత్తి వేయాలని కోరాడు.

ఆ లేఖలో చాలా నెలల క్రితం ఒప్పందం చేసుకున్న కార్యక్రమం అవ్వడం వల్ల వెళ్లానంటూ వివరణ ఇచ్చాడు. భారతీయుల మనోభావాలను దెబ్బ తీయాలనే ఆలోచన తనకు లేదని.. దేశం అంటే భక్తి ప్రేమ తనకు ఉన్నట్లుగా మీకా సింగ్‌ పేర్కొన్నాడు. మీకా సింగ్‌ వివరణతో సంతృప్తి చెందిన ఆల్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వారు అతడిపై ఉన్న బ్యాన్‌ ను ఎత్తి వేస్తున్నట్లుగా ప్రకటించింది. దాంతో మళ్లీ బాలీవుడ్‌ లో మీకా సింగ్‌ బిజీ అవ్వబోతున్నాడు.

Tags:    

Similar News