దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కి సర్వం సిద్ధం.. కానీ!

ఈ మధ్యకాలంలో సినిమా, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్స్ ను తెరపైకి తీసుకొస్తూ మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమాల ద్వారా తెలియజేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2026-01-14 08:25 GMT

ఈ మధ్యకాలంలో సినిమా, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్స్ ను తెరపైకి తీసుకొస్తూ మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమాల ద్వారా తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చారిత్రక అంశాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా భారతీయ సినిమా పితామహుడైన దుండిరాజ్ గోవింద్ ఫాల్కే బయోపిక్ ను తెరపైకి తీసుకురాబోతున్నారు. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయితగా పేరు దక్కించుకున్న ఈయన దాదాసాహెబ్ ఫాల్కేగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా 1913లో తన మొదటి సినిమా తీసిన ఈయన.. తన జీవిత కాలంలో 95 ఫీచర్ ఫిలిమ్స్ నిర్మించి పేరు దక్కించుకున్నారు.

ఇక ఈయన పేరు మీద గానే సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అతి తక్కువ మందికి మాత్రమే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందిస్తూ వారికంటూ ఒక స్థానాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో ఈ దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించడానికి సిద్ధం అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ. నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో మొదలయ్యింది. కానీ కొన్ని కారణాలవల్ల స్క్రిప్ట్ ప్రక్రియ ఆగిపోవడంతో అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రాజ్ కుమార్ హిరానీ , అమీర్ ఖాన్ ల సహకారం తిరిగి పట్టాలపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తిరిగి ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే జీవితం గురించి చెబుతూనే సమకాలీనంగా ప్రేక్షకులకు అనిపించాలని అమీర్ ఖాన్ భావిస్తున్నారట. అందులో భాగంగానే ఇప్పటి నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను రూపొందించాలని అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ భావిస్తున్నారు. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా సున్నితమైన స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజ్ కుమార్ హిరానీ చివరిగా షారుక్ ఖాన్ తో ఢంకీ సినిమా చేశారు. అయితే ఈ సినిమాకి సోషల్ మీడియాలో వచ్చిన అభిప్రాయాలను ఆయన దృష్టిలో పెట్టుకొని.. ఇకపై సోషల్ మీడియాలో చర్చలకు ఛాన్స్ ఇవ్వకుండా ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. మరొకవైపు అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాపై ఎటువంటి విమర్శలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా అమీర్ ఖాన్, హిరానీ గతంలో పీకే , 3 ఇడియట్స్ వంటి బ్లాక్ బాస్టర్ విజయాలను అందించారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఇద్దరి కాంబినేషన్లో ఈ బయోపిక్ రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా రాజకుమారి హిరానీ సున్నితమైన విషయాలను తెరపై చూపించేటప్పుడు తరచూ వివాదాలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు ఒక బయోపిక్ కాబట్టి.. ఏదైనా తప్పు జరిగితే విమర్శలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనే వార్తలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం వీరిద్దరూ 3 ఇడియట్స్ సీక్వెల్ పై పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తవ్వగానే తిరిగి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News