'ఈసారి బుల్లెట్ కరెక్టుగా దింపేద్దాం.. అదైతే ఫిక్స్ అయ్యా'

Update: 2021-02-18 12:05 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే మోషన్ పోస్టర్ కి థమన్ ఇచ్చిన బీజీఎమ్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకా ఆగస్ట్ లో అప్డేట్ ఇవ్వబోతునట్లు థమన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

తాజాగా ట్విట్టర్ లో 'సర్కారు వారి పాట' అప్డేట్ అడిగిన నెటిజన్ కి రిప్లై ఇచ్చిన థమన్ ''మనకు ఇంకా చాలా టైం ఉంది బ్రదర్.. కానీ ఈసారి బుల్లెట్ కరెక్టుగా దింపేద్దాం.. అదైతే ఫిక్స్ అయ్యా.. 2020 సంక్రాంతి రిలీజ్ కదా.. ఆగస్ట్ లో కలుద్దాం'' అని పేర్కొన్నాడు. ఆగస్ట్ లో మహేష్ బాబు బర్త్ డే ఉందనే సంగతి తెలిసిందే. గత పుట్టినరోజు నాడు మోషన్ పోస్టర్ ని వదిలిన చిత్ర యూనిట్.. ఈసారి సాలిడ్ అప్డేట్ తో రానుందని అర్థం అవుతోంది. కాగా, 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'ఆగడు' సినిమా తర్వాత మహేష్ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్న నాలుగో చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మధ్య బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందిస్తూ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయిన థమన్.. మరోసారి మహేష్ మూవీకి సూపర్ హిట్ ఆల్బమ్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.




Tags:    

Similar News