#వ‌కీల్ సాబ్‌.. కోర్టు ఆర్డ‌ర్ తో క‌న్ఫ్యూజ‌న్ లో ఫ్యాన్స్

Update: 2021-04-08 10:46 GMT
పెద్ద సినిమాల రిలీజ్ ల స‌మ‌యంలో టికెట్ పెంపు అన్న‌ది ప‌రిశ్ర‌మ‌లో అనాదిగా వ‌స్తున్న ఆచారం. పెద్ద పెట్టుబ‌డుల‌తో తెర‌కెక్కే భారీ చిత్రాల‌కు ఓపెనింగ్ వ‌సూళ్లు.. అద‌న‌పు షోలు.. బెనిఫిట్ షోల క్రేజుతోనే కొంత‌వ‌ర‌కూ నిర్మాత పంపిణీదారులు సేఫ్ అవ్వ‌డం అన్న‌ది చూస్తున్న‌దే. ఫ్యాన్స్ లో ఉన్న ఉత్సాహం.. ఆడియెన్ లో క్యూరియాసిటీ వెర‌సి తొలి మూడు రోజుల్లోనే సినిమా చూసేయాల‌న్న క‌సితో  ఈ షోల‌కు అంతే క్రేజు ఏర్ప‌డుతుంది. దీనికి కోర్టుల నుంచే అనుమ‌తులు తెచ్చుకుంటారు.

ఏప్రిల్ 9 న రిలీజ‌వుతున్న వ‌కీల్ సాబ్ కి అదే విధంగా టికెట్ పెంపున‌కు అనుమ‌తించిన కోర్టు అనూహ్యంగా రిలీజ్ ముందు వేసిన పంచ్ ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టికెట్ ధ‌ర‌ల పెంపు లేద‌ని దీనిని క‌లెక్ట‌ర్లు త‌హ‌శీల్దార్లు స‌మ‌న్వ‌యం చేయాల‌ని కోర్టు ఆర్డ‌ర్ వేయ‌డంతో వ‌కీల్ సాబ్ నిర్మాత‌లు పంపిణీదారులు నివ్వెర‌పోయారు. ఇప్ప‌టికే తొలి మూడు రోజుల టికెట్లు ప‌వ‌న్ క్రేజుతో అమ్ముడు పోయాయి. ఇవ‌న్నీ ఎక్కువ ధ‌ర‌ల‌కు అమ్మించార‌న్న టాక్ కూడా ఉంది.

మొద‌టి రోజే సినిమా చూడాల‌ని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. కొన్నిచోట్ల మొద‌టిరోజు టికెట్ ధ‌ర‌లు రూ.600 వ‌ర‌కూ పెంచి అమ్ముతున్నారు. ఇక చాలా చోట్ల‌ ఆన్ లైన్ లో రూ.200.. రూ.150 టికెట్లు మొద‌టి మూడు రోజుల‌కు అమ్మేశారు. కొన్నిచోట్ల ఇంకా బెనిఫిట్ షో టిక్కెట్ల అమ్మ‌కాలు సాగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో టికెట్ పెంపుపై కోర్టు కొత్త నిర్ణ‌యం షాకింగ్ గా మారింది. ఇప్ప‌టికే అమ్మేసిన టిక్కెట్ల‌ను క్యాన్షిల్ చేసి డ‌బ్బు వెన‌క్కి ఇవ్వాల‌న్న నిర్ణయం పైనా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి దీనిపై కలెక్టర్లు - జాయింట్ క‌లెక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ ఎలా ఉండ‌నుంది? అన్న‌ది ఒక సందిగ్ధం.

ఇక తాజా ప‌రిణామంతో బెనిఫిట్ షోల‌కు సంబంధించిన క్లారిటీ మిస్స‌య్యింద‌ని కొంద‌రు నివేదిస్తున్నారు.  ఏపీలో చాలా చోట్ల బెనిఫిట్ షోల‌కు సంబంధించి స‌రైన క్లారిటీ లేదు. 11 ఏఎం షోలే వేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలాగే కొన్నిచోట్ల పూర్తిగా థియేట‌ర్ టికెట్లు అమ్ముడు పోలేద‌ని తెలుస్తోంది. కొన్ని బెనిఫిట్ షోల‌కు టిక్కెట్లు అమ్ముడ‌యినా కొన్నిచోట్ల మిగిలి ఉన్నాయి. రూ.400 కి కూడా కొన్ని బెనిఫిట్ షో టిక్కెట్లు అమ్మారు. ఇక బెనిఫిట్ షోల టైమింగ్ కూడా క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. 8.30 షో.. 11 కి అని మ‌ళ్లీ 8 పీఎం అని క‌న్ఫ్యూజ్ చేయ‌డంపైనా ఒక అభిమాని నివేదించారు.

ఇక క‌రోనా క్రైసిస్ నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి థియేట‌ర్ల‌లో 50శాతం ఆక్యుపెన్సీ అన్న ఆందోళ‌న‌లు పంపిణీ వ‌ర్గాల్లో ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న‌ను ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చేయ‌డంతో అది తెలుగు రాష్ట్రాల్లోనూ అమ‌ల్లోకి వ‌స్తోందా? అన్న టెన్ష‌న్ అంద‌రిలో ఉంది. వ‌కీల్ సాబ్ విష‌యంలో ఏం జ‌రుగుతోంది? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్ప‌టికే అమ్ముడైన టికెట్ల విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌లుంటాయో వేచి చూడాలి.
Tags:    

Similar News