పవన్ ఎంట్రీ ఉంటుందా లేదా ?

Update: 2019-04-19 01:30 GMT
ఇంకో నెల రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. రెండు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు కొత్తగా ఆవిర్భవించిన పవన్ కళ్యాణ్ జనసేన ఎంట్రీతో పోటీ ట్రయాంగిల్ షేప్ తీసుకుంది. ముందస్తు అంచనాలు విశ్లేషణలు ఎగ్జిట్ పోల్స్ తదితరాలు జనసేనకు పెద్దగా అనుకూలంగా లేకపోయినా ఏదో అద్భుతం జరుగుతుందనే ఆశాభావంతో అభిమానులు ఉన్నారు. ఒకవేళ మొదటి ఎలక్షన్స్ కాబట్టి జనసేన కనక  ప్రభావం చూపించకపోతే ఐదేళ్ళు పెద్దగా పనేమీ ఉండదు.

ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం కూడా అనుమానమే కాబట్టి పవన్ మళ్ళి సినిమాలు చేయోచ్చనే టాక్ అప్పుడే మొదలైపోయింది. మైత్రి లాంటి సంస్థలు ఎప్పుడో అడ్వాన్సు ఇచ్చేసి పవన్ వెనక్కు ఇస్తానన్నా తీసుకోకుండా ఎప్పుడైనా సరే తమకు సినిమా చేయమంటూ విన్నవించి వెయిట్ చేస్తున్నాయి. పవన్ నిజంగానే ఓ రెండు మూడేళ్ళు సినిమాలు చేయాలని నిర్ణయించుకుంటే మాత్రం వెంటవెంటనే లైన్ లో మూడు ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి . క్రేజ్ విషయంలో వచ్చిన భయమేమి లేదు కాబట్టి బడ్జెట్ లు అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి.

కాని పవన్ తీసుకునే నిర్ణయం మీదే ఇది ఆధారపడి ఉంటుంది. అభిమానులు మాత్రం చిరంజీవి తరహాలో పవన్ కం బ్యాక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు స్వస్తి  పలికిన పవన్ ఆ మధ్య ఓ సినిమా చేయొచ్చు అనే ఊహగానాలు రేగినప్పుడు వాటికి కొట్టేస్తూ ఓ ప్రెస్ స్టేట్ మెంట్ కూడా విడుదల చేశారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో తరహాలో పవన్ రీ ఎంట్రీని పూర్తి కొట్టి పారేయలేం కాని ఇంకో నాలుగైదు నెలలు ఆగితే కాని క్లారిటీ రాదు
    
    
    

Tags:    

Similar News