• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ‌మౌళిని వ‌ద‌ల‌ని...

రాజ‌మౌళిని వ‌ద‌ల‌ని ఫ్యాన్ వార్ ముప్పు

By - Tupaki Desk
Update: 2021-11-02 02:35 GMT
ఇద్ద‌రు అగ్ర హీరోల‌ను క‌లిపి మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం అంటే అదో స‌వాల్ లాంటిదే. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రిని త‌క్కువ‌గా చూపించినా ఫ్యాన్స్ తీవ్రంగా హ‌ర్ట‌వుతారు. మా హీరోని త‌క్కువ చేస్తావా? అంటూ డైరెక్ట‌ర్ ని నిందిస్తారు. అదే మెగా వ‌ర్సెస్ నంద‌మూరి ఎపిసోడ్ అయితే ఆ ఘ‌ర్ష‌ణ ఎలా ఉంటుందో కూడా ఊహించ‌గ‌లం. కానీ జ‌క్క‌న్న అలాంటి సాహ‌స‌మే చేసారు. దీనిపై ఆర్.ఆర్.ఆర్ ప్రారంభ‌మైన తొలి రోజు నుంచి చ‌ర్చ సాగుతూనే ఉంది. సోష‌ల్ మీడియాల్లో నెటిజ‌నులు ర‌క‌ర‌కాల సందేహాల్ని వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. ఇది రాజ‌మౌళికి భారీ స‌వాల్ లాంటిది. ఇద్ద‌రు స్టార్ల‌ను బ్యాలెన్స్ చేస్తూ స‌మ‌ప్రాధాన్య‌త‌నిస్తూ ప్ర‌తిదీ చూపించాల్సి ఉంటుంది. ఆ విష‌యంలో ఎక్క‌డ ఫెయిలైనా రాజ‌మౌళికి నెటిజ‌నుల నుంచి ముప్పు త‌ప్ప‌దు.

తాజాగా రిలీజ్ చేసిన ఆర్.ఆర్.ఆర్ టీజ‌ర్ గ్లిమ్స్ లో ఆ ఇద్ద‌రినీ ఎంత బ్యాలెన్స్ చేసినా కానీ .. ఇరువురు స్టార్ల అభిమానులు ఇప్ప‌టికే ఘ‌ర్ష‌ణ‌కు రెడీ అయ్యారు. సోష‌ల్ మీడియాల్లో తార‌క్ అభిమానులు చ‌ర‌ణ్ అభిమానుల‌తో ఘ‌ర్ష‌ణ ప‌డుతుంటే.. అట్నుంచి కూడా రిప్ల‌య్ లు అదే రేంజులో ఘ‌ర్ష‌ణ‌ను క్రియేట్ చేస్తున్నాయి. యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ వీడియో చరణ్- తారక్ లను భారీ యాక్ష‌న్ ఫీట్స్ తో చూపించగా సాధారణ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అయినా ఫ్యాన్స్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌లేదు. మెగా నందమూరి అభిమానులు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే పనిలో పడ్డారు. టీజర్ నుండి చరణ్ - తారక్ ల స్నాప్ షాట్ లను పంచుకోవడంతో పాటు.. తమ అభిమాన నటుడి త‌ర‌పున వాదిస్తున్నారు. త‌మ ఫేవ‌రెట్ ఎన్టీఆర్ కి చరణ్‌ సరిపోరని నందమూరి అభిమానులు వాదిస్తుండగా.. మెగా అభిమానులు అంతే ధీటుగా కౌంట‌ర్లు వేస్తున్నారు.

నిజానికి జక్క‌న్న కానీ ఆయ‌న బృందం కానీ ఇలాంటి ఘర్ష‌ణ‌ను అస్స‌లు కోరుకోరు. తొలి నుంచి స్నేహితులిద్ద‌రినీ ఎంతో ఉన్న‌తంగా తెర‌పై చూపించేందుకు పోటాపోటీగా ఆవిష్క‌రించేందుకు ఆ పాత్ర‌ల్ని తీర్చిదిద్దారు. అభిమానులు దీనిని అర్థం చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. క్షణికావేశాలు వికారాల‌కు గురి కాకుండా సినిమాని ర‌ణం రౌద్రం రుదిరం అనే క‌థాంశం కోణంలో మాత్ర‌మే చూడాల‌ని రాజ‌మౌళి అభిమానులు కోరుతున్నారు. ఫ్యాన్స్ ఒక క‌థ‌ను క‌థ‌లా మాత్ర‌మే చూడాలి. స్టార్ ప‌వ‌ర్ ని దృష్టిలో ఉంచుకుని చూడ‌డం అవ‌స‌ర‌మే అయినా .. క‌థ‌ను సంగ్ర‌హించాల‌ని కోరుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న RRR ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్ - అజయ్ దేవగన్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖ తార‌లు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Tags:    
  • RRR 
  • pre-release 
  • Rajamouli 
  • Ram Charan 
  • Jr NTR 
  • India 
  • biggest 
  • action 
  • drama 
  • update 
  • teaser 
  • pvrrr 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS