తిరుపతి-హైదరాబాద్.. 12రోజులు సైకిల్ తొక్కి చివరికి చిరుని కలిసాడు!
మెగాస్టార్ చిరంజీవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన అభిమానులు వందల కిలోమీటర్లు కాలి నడకన లేదా సైకిల్ యాత్రలతో సందర్శించేందుకు వెనకాడరు. ఇప్పుడు అలాంటి అరుదైన సంఘటన ఇది. మెగాస్టార్ 66వ పుట్టినరోజు ఆగస్టు 22న జరిగింది. ఈ వేడుకల్లో ఆయనకు విషెస్ తెలిపేందుకు తిరుపతి అలిపిరి నుంచి ఒక వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టి 12రోజులు ప్రయాణించడం సంచలనమైంది.
ఈ సందర్భంగా చిరంజీవి తనను కలిసేందుకు విచ్చేసిన అభిమానిని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణం సాహసోపేతమని సరికాదని వారించారు. మెగాస్టార్ మాట్లాడుతూ-``నా అభిమాని ఎన్. ఈశ్వరయ్య బలుజుపల్లి గ్రామం నుంచి వచ్చాడు. తిరుపతి (అలిపిరి) నుంచి అతడు సైకిల్ పై ప్రయాణం ప్రారంభించాడు. నా పుట్టినరోజు కోసం అతడు సైకిల్ యాత్రను చేపట్టి వచ్చి కలిసాడు. నా ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి మాలను ధరించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలోచిస్తూ వచ్చారు. ఆగస్టు 10న బయల్దేరి 12 రోజుల పాటు సైకిల్ యాత్ర చేసుకుంటూ అలిపిరి నుంచి వచ్చాడు ఈ అభిమాని. చాలా సందర్భాల్లో చెప్పాను. మాకు అభిమానుల ప్రేమ ఆదరణ గొప్ప ఎనర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మనసు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించినట్టే మేం కూడా వారు వారి కుటుంబ సభ్యులు బావుండాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని అన్నారు. అలాగే తమ్ముడు పవన్ కల్యాణ్ ని కలవాలని అడిగిన ఆ అభిమానికి కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయగా అతడు నేరుగా పవన్ ని కలవగలిగారు. ఇక అలిపిరి నుంచి సైకిల్ పైనే వచ్చిన ఈ వీరాభిమాని చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
తిరుపతి అలిపిరి వరకూ తిరుగు ప్రయాణం ఎలా అంటే అతడు తిరిగి వెళ్లేందుకు మెగాభిమాన సంఘం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రమలేకుండా అతడిని పంపించే ఏర్పాట్లు చేయాలని చిరు కోరారు. మెగాస్టార్ 22 ఆగస్టు రోజున రక్షా బంధన్ సెలబ్రేషన్స్ సహా బర్త్ డే వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మెగాస్టార్ ఇంట ఆరోజు బోలెడంత సందడి నెలకొంది. అభిమానుల శుభాకాంక్షలతో పాటు.. సినీరాజకీయ రంగ ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగా అభిమాని తో మెగా బ్రదర్స్ ఫోటోలు తాజాగా వైరల్ గా మారాయి.