హీరోలు ఈసారి దూకుడు తగ్గించే ఛాన్స్!
మిగతా సినిమాల పరిస్థితి ఏంటి? అంటే ఆ సినిమాకు వసూళ్లు బాగానే ఉన్నాయి. కానీ రిలీజ్ టైమ్ అన్నది రాంగ్ గా మారిందా? అన్న ప్రచారం తెరపైకి వస్తుంది.;
ఈ సంక్రాంతి సందర్బంగా మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా `ది రాజాసాబ్`..ఆ తర్వాత `మనశంకర వరప్రసాద్ గారు`, అటుపై `భర్త మహాయులకు విజ్ఞప్తి`, `నారీ నారీ నడుమ మురారీ`, `అనగనగా ఒక రాజు` చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో `రాజాసాబ్` ప్లాప్ అవ్వగా, `భర్త మహాయులకు విజ్ఞప్తి` కి యావరేజ్ టాక్ వచ్చింది. మిగతా మూడు సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ మూడు సినిమాలకు మంచి రివ్యూలు వచ్చాయి. పబ్లిక్ టాక్ బాగుంది. `మనశంకర వరప్రసాద్ గారు` ఏకంగా వందల కోట్ల వసూళ్లను సాధించింది.
మిగతా సినిమాల పరిస్థితి ఏంటి? అంటే ఆ సినిమాకు వసూళ్లు బాగానే ఉన్నాయి. కానీ రిలీజ్ టైమ్ అన్నది రాంగ్ గా మారిందా? అన్న ప్రచారం తెరపైకి వస్తుంది. సంక్రాంతి సీజన్ అనే మోజులో రిలీజ్ చేసారు. కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. సరైన థియేటర్లు దొరకకా? హిట్ టాక్ వచ్చినా సినిమా కిల్ అయింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రోజులో ఒక పూట ఒక సినిమా..మరో పూట మరో సినిమా వేసారు. ఇప్పటికీ అలాగే ఆడిస్తున్నారు. వరప్రసాద్ తర్వాత నారీ నారీ నడుమ మురారీ, అనగనగా ఒకరాజు చిత్రాలకు వచ్చిన టాక్..రివ్యూలు చూస్తే? భారీ వసూళ్లు సాధించాలి.
కానీ ఆ స్థాయిలో వసూళ్లు కనిపంచలేదు. ఆ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నా? థియేటర్లు లేక చూడలేని పరిస్థితులు తలెత్తాయి. అవే సినిమాలు సాధారణ రోజుల్లో గనుక రిలీజ్ అయి ఉంటే మంచి లాభాలు చూసేవి. భారీ ఎత్తున థియేటర్లు దొరకినప్పుడే అది సాద్యమవుతుంది. సీజన్ అనే మోజులో సినిమాను రిలీజ్ చేస్తే హిట్ సినిమా కూడా కిల్ అవుతుంది? అనడానికి ఆ రెండు సినిమాలే ఉదాహరణ. `భర్త మహాశయులకు విజ్ఞప్తి` సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. పోటీ మధ్య కాకుండా సాధారణ రోజుల్లో ఆ సినిమా రిలీజ్ అయితే జనాలు చూసేవారు అనే అమాట మార్కెట్ లో బలంగా వినిపిస్తోంది.
ఈ విషయాలన్నింటిని దర్శక, నిర్మాతలు దృష్టిలో పెట్టుకుని సమ్మర్ రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇబ్బడిముబ్డిగా సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ చేసి ఇబ్బంది పడటం కంటే సౌక ర్యవంతమైన రోజులు చూసుకుని రిలీజ్ ప్లాన్ చేసుకుంటే మంచి సినిమాలకు మేలు జరుగుతుందని భావి స్తున్నారు. ప్రధానంగా కావాల్సినన్ని థియేటర్లలో నచ్చినన్నీ రోజులు సినిమాను ఆడించుకునే వెసులుబాటు దొరుకుతుంది.