• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అవన్నీ గాలి వార్తలే..!

అవన్నీ గాలి వార్తలే..!

By - Tupaki Desk
Update: 2022-06-21 10:30 GMT
స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య మరో హీరోయిన్‌ తో డేటింగ్‌ లో ఉన్నాడంటూ గత రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగమ్మాయి, 'గూఢచారి' ఫేమ్ శోభిత ధూళిపాళతో చైతూ డేటింగ్ చేస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అంతర్గత నివేదికల ప్రకారం ఈ డేటింగ్ రూమర్స్ నిజం కాదని తెలుస్తోంది.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, 'మేజర్' ప్రమోషన్ల సమయంలో శోభిత ను కలిసేందుకు ఆమె బస చేసిన హోటల్‌ కు నాగ చైతన్య చాలాసార్లు వెళ్లాడట. అలానే హైదరాబాద్‌ లోని చై కొత్త ఇంట్లో ఇద్దరూ కనిపించారని.. ఒకే కారులో బయటకు వెళ్లారని పేర్కొన్నారు. అయితే ఈ పుకార్లు నిరాధారమైనవని తెలుస్తోంది.

నాగ చైతన్య లేదా శోభిత ఇంకా డేటింగ్ పుకార్లను ఖండించనప్పటికీ.. అవన్నీ గాలి వార్తలే అని.. ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని ఇన్ సైడ్ వర్గాలు వెల్లడించాయి. 'గూడాచారి' తర్వాత శోభిత అక్కినేని ఫ్యామిలీతో సన్నిహిత బంధాన్ని కలిగి ఉందని.. చైతన్యతో పరిచయం కూడా ఇందులో భాగమని అంటున్నారు. అంతేకానీ ఇప్పుడు వినిపిస్తున్న డేటింగ్ వార్తలు ఏమాత్రం నిజం కాదని చెబుతున్నారు.

డేటింగ్ రూమర్లు అనేవి నటీనటులకు, సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. చైతూ విషయంలోనే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత తో కొన్నేళ్ళు డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడంతో అన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో చైతన్య పై ఇప్పుడు మళ్లీ డేటింగ్ రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ అవి నిజం కాదని తెలుస్తోంది.

డివోర్స్ ప్రకటన తర్వాత నాగచైతన్య ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. కెరీర్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నారు. 'థ్యాంక్యూ' మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది. అలానే ఆమిర్ ఖాన్ తో కలిసి నటించిన హిందీ సినిమా 'లాల్ సింగ్ చద్దా' ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్న చై.. విక్రమ్ కె కుమార్ తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'దూత' అనే హారర్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. దీని తర్వాత 'సర్కారు వారి పాట' దర్శకుడు పరశురామ్ తో చైతూ ఓ ప్రాజెక్ట్ చేస్తారు.

మరోవైపు వైజాగ్ బ్యూటీ శోభిత ధూలిపాళ్ల హీరోయిన్‌ గా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. 'కురూప్' చిత్రంతో మెప్పించిన శోభిత.. లేటెస్టుగా 'మేజర్' తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'పొన్నియన్ సెల్వన్' మూవీలో శోభిత ధూళిపాళ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో పాటుగా హిందీ - ఇంగ్లీష్ భాషల్లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తోందని సమాచారం.
Tags:    
  • SamanthaRuthPrabhu 
  • NagaChaitanya 
  • SobhitaDhulipala 
  • GudachariFame 
  • MajorMovie 
  • TollywoodFilms 
  • FilmIndustry 
  • DuthaWebSeries 

Similar News

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS