• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లుంగీలు ఎగ్గట్టుకుని...

లుంగీలు ఎగ్గట్టుకుని బయల్దేరండహో..

By - Tupaki Desk
Update: 2015-08-06 08:00 GMT

Full View
మహేష్ అంటే క్లాస్.. అలాగని అతడికి మాస్ లో ఫాలోయింగ్ లేదా అంటే అదేమీ కాదు. క్లాస్ గా కనిపిస్తూనే మాస్ ఆడియన్స్ కు కూడా పిచ్చెక్కిస్తాడు. పోకిరి సినిమాలో అతడి వేషాలు మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. మధ్యలో ‘దూకుడు’ సినిమాతోనూ మాస్ ను మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మాస్ మీద కన్నేశాడు ప్రిన్స్. శ్రీమంతుడు క్లాస్ సినిమానే కానీ.. అలాగని కొరటాల మాస్ ఆడియన్స్ గురించి ఆలోచించలేదని అనుకోవడానికేమీ లేదు. సినిమా విడుదల దగ్గర పడుతుండగా మూడు రోజుల నుంచి చేస్తున్న ప్రమోషన్ చూస్తుంటే మాస్ ఆడియన్స్ నే టార్గెట్ చేసినట్లుంది. దిమ్మదిరిగే పాటతో రిలీజ్ చేసిన టీజర్ రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. అందులో పంచె కట్టి మహేష్ వేసిన మాస్ స్టెప్పులు మాస్ ఫ్యాన్స్ ని నిలవనీయడం లేదు.

తాజాగా నిన్న రిలీజ్ చేసిన లుంగీ పోస్టర్, టీజర్ ‘శ్రీమంతుడు’ మీద మాస్ ఆడియన్స్ అంచనాల్ని పీక్స్ కు చేర్చాయి. అలాగని క్లాస్ ఆడియన్స్ కు ఈ నయా అవతార్ నచ్చలేదనుకోవడానికేం లేదు. మహేష్ ను ఇలా చూడటం ఏ అభిమానికైనా కనువిందే. లుంగీ ఎగ్గట్టి మహేష్ నడుస్తున్న తీరు చూస్తుంటే.. ‘‘అందరూ లుంగీలు ఎగ్గట్టి థియేటర్లకు బయల్దేరండహో’’ అని మాస్ ఆడియన్స్ ను పిలుస్తున్నట్లే ఉంది. ఈ సన్నివేశం సినిమాలో ద్వితీయార్ధంలో వస్తుందని సమాచారం. ఆ సమయంలో థియేటర్లు దద్దరిల్లిపోవడం మాత్రం ఖాయం. ఇది మాస్ కు విందు భోజనమైతే.. ప్రథమార్ధంలో క్లాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించే సన్నివేశం ఇంకోటుంది. అదే మహేష్ బుక్ చేతబట్టి కాలేజీకెళ్లే సీన్. అప్పుడెప్పుడో ‘యువరాజు’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన మహేష్.. మళ్లీ ఇప్పుడు నలభై ఏళ్లకు దగ్గరవుతూ కాలేజ్ స్టూడెంట్ అవతారమెత్తుతున్నాడు. ఆ సన్నివేశం ప్రథమార్ధానికి హైలైట్ అంటున్నారు. మొత్తానికి ‘శ్రీమంతుడు’లో అన్ని రకాల ఫ్యాన్స్ ని అలరించే సన్నివేశాల్ని ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్ కొరటాల.
Tags:    
  • Mahesh babu 
  • Shruthi Hassan 
  • Srimanthudu Movie 
  • Telugu News 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS