• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ సినిమాకు సర్వం...

మహేష్ సినిమాకు సర్వం సిద్ధం..!

By - Tupaki Desk
Update: 2022-08-30 23:58 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కలయికలో 'అతడు' 'ఖలేజా' వంటి సినిమాలు వచ్చాయి. దాదాపు పుష్కర కాలం తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలుస్తుండంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి.

త్రివిక్రమ్ ట్రేడ్‌ మార్క్‌ ఫ్యామిలీ డ్రామాతో అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా.. ఆగస్టులోనే సెట్స్ మీదకు వెళ్లాల్సింది. సమ్మె కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉండటంతో మహేష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ చేయడానికి సర్వం సిద్ధమైంది.

SSMB28 సినిమా షూటింగ్ సెప్టెంబర్ 8వ తేదీ నుండి ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా పాల్గొననున్నారు.

ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. దీని కోసం గత కొన్ని రోజులుగా గడ్డం మీసాలు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. 'మహర్షి' తర్వాత మరోసారి ఈ జంట కనువిందు చేయనుంది.

ఒక పాపులర్ యువ హీరో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని టాక్. నటీనటుల వివరాలు షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2023 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేయబడ్డాయి.  

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించనుండగా.. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • SuperStar 
  • MaheshBabu 
  • TrivikramSrinivas 
  • SSMB28 
  • Athadu 
  • Khaleja 
  • Hyderabad 
  • RamojiFilmCity 
  • PoojaHegde 
  • CinemaShooting 
  • MovieNews 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS