న్యూ ఇయర్ రోజున బోసిపోయిన థియేట‌ర్లు..!

Update: 2021-01-02 10:15 GMT
కరోనా నేపథ్యంలో కొన్ని షరతులతో థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి అప్పుడెప్పుడో కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే మొన్న క్రిస్మస్ వరకు థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో కొందరు టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత‌లు థియేట‌ర్ లో సినిమాలు వేయ‌డానికి అడ్డుప‌డుతున్నారు అనే కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ పెద్ద‌లు ఎందుకు సినిమాల్ని థియేట‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి అడ్డుప‌డ్డారో అనే రియ‌లైజేష‌న్ ఇప్పుడు వచ్చిందని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వివ‌రాల్లోకి వెళితే ప్రస్తుతం థియేటర్స్ లో 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' 'వండ‌ర్ వుమెన్' 'టెనెట్' 'ఒరేయ్ బుజ్జిగా' 'వి' వంటి సినిమాలు ఉన్నాయి. వాస్తవానికి న్యూ ఇయ‌ర్ రోజున సాధ‌ర‌ణ ప‌రిస్థితుల్లో సినిమాల‌కు టికెట్స్ దొరికే అవ‌కాశం లేదు. ఎలాంటి సినిమా అయినా మూవీ ల‌వ‌ర్స్ జ‌న‌వ‌రి 1న సినిమా చూడ‌టానికి ఆస‌క్తి చూపుతుంటారు. దానికి తోడు ఫ్రైడే కూడా కావ‌డంలో ఈ ఏడాదికి మ‌రో ఫేవ‌ర్ క‌లిసి వ‌చ్చింది. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఆడియెన్స్ నిన్న థియేట‌ర్స్ కి రాలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న సినిమాలను చూడటానికి జ‌నాలు అసలు రాలేదు. దాదాపు థియేట‌ర్స్ అన్నీ బోసిపోయాయని తెలుస్తోంది. ఈ డేట్ మీద హోప్స్ పెట్టుకున్న 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' టీమ్ కి నిరాశే మిగిలింది. అలానే 'వి' 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలను థియేట‌ర్ లో విడుద‌ల చేసి క్యాష్ చేసుకోవాలని చూసిన మేకర్స్ ప్లాన్స్ రివ‌ర్స్ అయ్యాయి. మల్టీప్లెక్సులతో పాటు ఈ సినిమాలు విడుద‌లైన సింగిల్ స్క్రీన్స్ కూడా డెపీసీట్స్ చూపిస్తున్నాయని సమాచారం. ఏదేమైనా కొత్త సంవత్సరం పై అసలు పెట్టుకున్న వారికి నిరాశ చెందారని తెలుస్తోంది.
Tags:    

Similar News