200 కోట్ల స్కామ్.. ఖరీదైన కార్లు గిఫ్టులన్నీ లాక్కుంటున్న ఈడీ
బాలీవుడ్ భామలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్- నోరా ఫతేహిలకు మల్టీ మిలియనీర్ కాన్ మెన్ సుఖేష్ చంద్రశేఖర్ ఇచ్చిన బహుమతులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలో స్వాధీనం చేసుకోనుంది.
వారికి కొన్ని పెంపుడు జంతువులను కూడా బహుమతిగా ఇచ్చినందున అలాంటి సందర్భాలలో అదే విలువ గల ఆస్తిని అటాచ్ చేస్తారని ED వర్గాలు తెలిపాయి.
సుకేష్ చంద్రశేఖర్ తనకు బహుమతిగా ఇచ్చిన బిఎమ్‌డబ్ల్యూ కారును స్వాధీనం చేసుకునేందుకు అధికారులు స్వేచ్ఛగా ఉన్నారని ప్రశ్నోత్తరాల సమయంలో నోరా ఫతేహి తమతో చెప్పినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. జాక్వెలిన్ పై కూడా ఇలాంటి కేసు ఉందని ఆమె కూడా ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సుకేష్ చంద్రశేఖర్ నేపథ్యం తనకు తెలియదని.. సుకేష్ తనకు ఇచ్చిన బహుమతులను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని జాక్వెలిన్ అధికారులతో చెప్పినట్లు సమాచారం. ఈ అటాచ్‌మెంట్ ప్రాసెసింగ్ PMLAలోని సెక్షన్ 5 కింద జరుగుతుంది.
ఈడీ అధికారులు జాక్వెలిన్ -నోరాలకు ఇచ్చిన బహుమతులు .. ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోబోతున్నారని అయితే వారు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉందని దీనివల్లనే ఆలస్యమైందని వెల్లడైంది. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న పింకీ ఇరానీని కూడా అరెస్టు చేశారని తెలిసింది.
చార్జిషీట్ దాఖలు చేయడం.. కొత్త అరెస్టుల వాంగ్మూలాలు నమోదు చేయడం కోసం చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఈ కేసులో మరో ఏడుగురిని అరెస్టు చేయాల్సి వచ్చింది. మేము వారిని విచారించాల్సి ఉంది. వారి సాక్ష్యాలను కూడా నమోదు చేయాలి. కాబట్టి దీనికి కొంత సమయం పట్టవచ్చు అని ఓ మీడియా ద్వారా తెలిసింది. ఇద్దరు నటీమణులు ప్రస్తుతం ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. 200 కోట్ల PMLA కేసులో వారి వాంగ్మూలాలను నమోదు చేశారు.
ఈ కేసులో వారిని ఎందుకు నిందితులుగా చేయలేదని అడిగినప్పుడు సుకేష్ నేర నేపథ్యం గురించి ఇద్దరు నటీమణులకు తెలియదని ఈడీ ధృవీకరించిందని తెలిసింది. బహుమతులు పొందిన వ్యక్తికి డబ్బు మూలం గురించి తెలుసా? అది క్రైమ్‌లో భాగమా లేదా అనేది చూడాలి. జాక్వెలిన్ .. నోరాలకు ఈ విషయం గురించి తెలియదని మేము కనుగొన్నామని అధికారుల ద్వారా లీకైనట్టు సదరు మీడియా కథనం వెలువరించింది.