చెర్రీలోని సిస‌లైన‌ డైన‌మిజం అలా బ‌య‌ట‌కు..!

Update: 2021-06-05 03:30 GMT
ఒక వ్య‌క్తిలో మంచి క్వాలిటీ ఎలా బ‌య‌ట‌ప‌డుతుంది?  బాగా సంపాదించేస్తే.. స్టైల్ ఐక‌న్ గా వెలిగిపోతే.. ఇండ‌స్ట్రీలో ఎదురేలేని స‌క్సెస్ లో ఉంటే.. ఇది స‌రిపోతుందా?  దానికి తోడు తీసుకున్న దాని నుంచి కొంతయినా తిరిగి ప్ర‌జ‌ల‌కే ఇచ్చేస్తే అప్పుడు బ‌య‌ట‌ప‌డుతుంది అస‌లు సిస‌లైన డైన‌మిజం. తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడే గొప్ప‌వాడు అని ప్రూవ్ అవుతుంది.

ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందున్నారు. మ‌రి ఆయ‌న వార‌సుడిగా రామ్ చ‌ర‌ణ్ ఏం చేస్తున్నారు? అంటే.. చాలాకాలంగా బ్లడ్ బ్యాంక్ ఐబ్యాంకుల్ని ప‌ర్య‌వేక్షిస్తున్న చ‌ర‌ణ్‌.. ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజ‌న్ బ్యాంకుల య‌జ్ఞాన్ని తండ్రితో క‌లిసి ప్రారంభించాల‌న్న ఆలోచ‌న చేసిన‌ది రామ్ చ‌ర‌ణ్‌. ప్ర‌జ‌ల క‌ష్టాన్ని చూసి తండ్రిలానే ఆయ‌న కూడా చ‌లించిపోయారు. అందుకే విదేశాల నుంచి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు కాన్ స‌న్ ట్రేట‌ర్లు ర‌ప్పించేందుకు చ‌ర‌ణ్ ఎంతో కృషి చేశారు. ప్ర‌స్తుతం రోగుల‌కు ఆక్సిజ‌న్ పంపిణీ ఎలా సాగుతోందో ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఇదంతా చూశాక అతడిలోని డైన‌మిజానికి ప్ర‌జ‌లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా అంద‌రికీ అత‌డు మ‌రింత‌గా అర్థ‌మ‌వుతున్నాడు.. ఇంకా బాగా చేరువ‌వుతున్నాడు.

ఇక చ‌ర‌ణ్ సినీకెరీర్ ప‌రంగా ఎదురేలేని వాడిగా స‌త్తా చాటుతున్నారు. కొద్ది రోజుల క్రితం  నిర్మాత దిల్ రాజు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా రామ్ చ‌ర‌ణ్ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి దక్షిణ భారత సినిమా షోమ్యాన్ శంకర్ దర్శకత్వం వహిస్తుండ‌డం ఉత్కంఠ పెంచుతోంది. ఇది తమ ప్రొడక్షన్ బ్యానర్ నుండి 50 వ చిత్రంగా ఉండబోతున్నందున ఇది చాలా భాషల్లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తామ‌ని దిల్ రాజు చెప్పారు.

రామ్ చరణ్ ఈ చిత్రంలో యువ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడన్నాడ‌న్న ఊహాగానాలతో సోషల్ మీడియా అస్పష్టంగా ఉంది. చరణ్ నిజంగానే అలాంటి డైనమిక్ క్యారెక్టర్ పోషిస్తున్నాడా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆర్.ఆర్.ఆర్ స‌హా ఆచార్య‌లోనూ చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళితో ఆర్.ఆర్.ఆర్ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తుంద‌ని చ‌ర‌ణ్ ని మరో లెవ‌ల్ కి తీసుకెళుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. శంక‌ర్ సినిమాతో అది మ‌రో లెవ‌ల్ ని తాకుతుంద‌న్న అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News