మలయాళ స్టార్ హీరోని డైరెక్ట్ చేయబోతున్న హను...!

Update: 2020-05-07 06:50 GMT
‘అందాల రాక్షసి’ ‘పడి పడి లేచే మనసు’లాంటి మనసుని హత్తుకొనే  చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి. అయితే ఆ తర్వాత కాలంలో వచ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' మినహా మిగతా సినిమాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయనే చెప్పాలి. ఎన్నో అంచనాలతో వచ్చిన 'లై' సినిమా తీవ్ర నిరాశ పరిచింది. అయితే లేటెస్ట్ గా హను రాఘవపూడికి సంభందించిన ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ తెలుగులో నటించబోయే సినిమాకి దర్శకత్వ బాధ్యతలు హను రాఘవపూడికి దక్కినట్లు సమాచారం. 'మహానటి' సినిమా నిర్మించిన స్వ‌ప్న సినిమా సంస్థ‌లో ఈ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం.

మలయాళంలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న దుల్కర్ సల్మాన్ 'మహానటి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యాయి. ఈ మధ్య విడుదలయిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అప్పటి నుంచి నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలని ఎదురు చూస్తున్న దుల్కర్ సల్మాన్ కు.. హను రాఘవపూడి చెప్పిన స్క్రిప్ట్‌ నచ్చినట్లు సమాచారం. దుల్కర్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ్‌ లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. హిట్టు సినిమాలు తీసిన దర్శకులకే స్టార్ హీరోలు అవకాశం ఇవ్వని ఈ రోజుల్లో హను లక్కీ ఛాన్స్ కొట్టేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

టాలెంట్ ఉన్నా సక్సెస్ లేని  తెలుగు దర్శకుల్లో హను రాఘవపూడి మొదటి వరుసలో ఉంటాడు. ఫ్లాప్ డైరెక్టర్‌ గా ముద్ర పడిన హను రాఘవపూడి ఈ చిత్రం ద్వారా అయినా క్రేజీ దర్శకుల్లో ఒకడిగా నిలిచిపోతాడేమో చూడాలి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న ఈ సినిమా లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం పట్టాలెక్కనున్నదని సమాచారం.
Tags:    

Similar News