డ్రగ్స్ : రూ.7 వేల కోట్ల సరుకు అమ్ముడు పోయిందా...?
సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హీరో సుశాంత్ సూసైడ్ కేసులో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. రోజుకో మలుపు తిరుగుతూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పలువురు డ్రగ్ డీలర్స్ ని పెడ్లర్స్ ని అరెస్ట్ చేసిని అధికారులు హీరోయిన్లు రియా చక్రవర్తి - రాగిణి ద్వివేది - సంజన లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే ఈ డ్రగ్ వ్యవహారం బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీస్ లోనూ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారట. ఈ క్రమంలో డ్రగ్ డీలర్స్ సినీ ఇండస్ట్రీలోకి చొరబడి ఓ రేంజ్ లో బిజినెస్ చేస్తున్నారని.. నాలుగు సౌత్ రాష్ట్రాల్లో ఈ మధ్య దాదాపు 15 వేల కోట్ల డ్రగ్స్ అమ్మకాలు జరిగాయని డ్రగ్ డీలర్లు ముంబైలో వెల్లడించినట్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాటిలో కేవలం హైదరాబాద్ లోనే దాదాపు 7 వేల కోట్ల రూపాయల సరుకు అమ్ముడుపోయి ఉండొచ్చని అంటున్నారు. పెద్ద సినిమాల బడ్జెట్ కూడా ఆ రేంజ్ లో ఉండదేమో.. కానీ డ్రగ్స్ కోసం అంత ఖర్చుపెడుతున్నారా అని.. సినిమాల్లో చూపించినట్లు నిజంగానే డ్రగ్స్ మాఫియా ఆ స్థాయిలో ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కాగా, ఒకప్పుడు 'డ్రగ్' అంటే సంపన్నులకు మాత్రమే లభ్యమయ్యే ఖరీదైన మత్తు పదార్థం. కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీ - ఐటీ సెక్టార్ మొదలుకొని మిడిల్ క్లాస్ ప్రజలు.. స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఐరోపా దేశాల నుంచి.. నైజీరియా లాంటి ఆఫ్రికా దేశాలు నుంచి కొకైన్ - ఓపియం - హెరాయిన్ - ఎండీఎంఏ వంటి ఖరీదైన మత్తు పదార్థాలు దిగుమతి అవుతున్నాయని తెలుస్తోంది. ఇక్కడ మూత పడ్డ ఫార్మా కంపెనీలు కూడా డ్రగ్స్ ముఠాలకు అడ్డాలుగా మారుతున్నాయట. ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) మరియు ఎక్సైజ్ పోలీసులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రైడ్స్ చేసి రూ. 100 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను సీజ్ చేశారు. అంతేకాకుండా ఇటీవల ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న కోటి రూపాయల విలువ చేసే డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఆ రేంజ్ లో డ్రగ్ బిజినెస్ జరగడానికి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీలు.. పుట్టినరోజు వేడుకలు.. ప్రైవేట్ ఈవెంట్లు.. పబ్ లు, కాలేజ్ పార్టీలు, బార్ లు, రిసార్టులు, ఫామ్ హౌ్‌స లలో జరిగే పార్టీల్లో డ్రగ్స్ వాడకమే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే సినీ ఇండస్ట్రీలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న పార్టీల్లో ఈ డ్రగ్స్ అనేవి ఇప్పుడు ట్రెండ్ గా మారిందని.. అందుకే ప్రతి పార్టీకి కూడా డ్రగ్స్ సప్లై చేస్తున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ ద్వారా ఎక్కువ బిజినెస్ జరుగుతుండటంతో డ్రగ్ డీలర్లు కూడా ఇండస్ట్రీలోని ప్రముఖులతో డీల్స్ చేసుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య అరెస్ట్ చేసిన హీరోయిన్ల ద్వారా డ్రగ్ రాకెట్ లో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని.. మూడేళ్ల క్రితం రాజకీయ నేతలను సెలబ్రిటీలను గడగడలాడించిన డ్రగ్స్ వ్యవహారం లాంటిది మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందని.. ప్రభుత్వాలు కూడా డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక హోమ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మై.. శాండల్ వుడ్ డ్రగ్స్ దందా కేసును నిష్పాక్షపాతంగా విచారించాలని.. అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. ఈ కేసుతో డ్రగ్స్ మాఫియా తుడిచిపెట్టుకు పోవాలని అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ మాఫియాపై ఎలాంటి ఫోకస్ పెడతారో చూడాలి.