ఆర్‌ ఆర్‌ ఆర్‌ వచ్చే ఏడాది సాధ్యమేనా?

Update: 2020-07-05 08:30 GMT
బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంను మొదట ఈ ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ జక్కన్న అధికారికంగా ప్రకటించాడు. కాని సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతున్న కారణంగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామంటూ మరోసారి అధికారికంగా ప్రకటించారు.

ఈసారి మహమ్మారి వైరస్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. షూటింగ్‌ ముగింపు దశకు వచ్చినా కూడా సంక్రాంతికి విడుదల అనేది సాధ్యం కాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మొన్నటి వరకు సినిమాను 2021 జులై విడుదల చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కాని తాజాగా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉంటే సినిమా వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం లేదనిపిస్తుంది.

గత నెలలో షూటింగ్‌ ను మొదలు పెట్టాలని భావించారు. కాని కేసుల సంఖ్య అత్యధికంగా పెరుగుతుండటం.. సీరియల్స్‌ షూటింగ్స్‌ జరుగుతున్న సమయంలో కేసులు అనూహ్యంగా బుల్లి తెర వారిలో కేసులు పెరగడం వల్ల ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ను మళ్లీ వాయిదా వేశారట.

వ్యాక్సిన్‌ వచ్చే వరకు లేదంటే ఈ ఏడాది చివరి వరకు షూటింగ్‌ ను మొదలు పెట్టేది అనుమానమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ షూటింగ్‌ ను ఈ ఏడాది ఆరంభించనట్లయితే సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అనుమానమే అంటున్నారు. మరి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.


Tags:    

Similar News