పెళ్లి తర్వాత నిహారిక ఫస్ట్‌ బర్త్‌ డేను చైతన్య ఎక్కడ చేస్తున్నాడో తెలుసా?

Update: 2020-12-18 12:30 GMT
మెగా వారి ఇంటి అమ్మాయి నిహారిక కొనిదెల ఇటీవలే చైతన్య ను పెళ్లి చేసుకుని జొన్నలగడ్డ వారి అమ్మాయిగా మారిపోయింది. ఇక నేడు నిహారిక పుట్టిన రోజు జరుపుకుంటుంది. తన 28వ వసంతంలోకి అడుగు పెడుతున్న నిహారికకు ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వేడుకలను ఇటు కొనిదెల ఫ్యామిలీ అటు జొన్నలగడ్డ వారి ఫ్యామిలీ నిర్వహిస్తుంది. నిన్న రాత్రి సమయంలో జబర్దస్త్‌ మరియు అదిరింది కమెడియన్స్‌ తో పాటు తన సన్నిహితులకు నాగబాబు పిలిచి నిహారిక బర్త్ డే పార్టీని ఇచ్చాడు.

ఇక నేడు నిహారిక బర్త్‌ డే పార్టీని పలక్‌ నుమా ప్యాలెస్ లో వైభవంగా చైతన్య నిర్వహించబోతున్నాడు. ఈ బర్త్ డే వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. పెళ్లి తర్వాత వచ్చిన నిహారిక మొదటి పుట్టిన రోజు అవ్వడంతో ఎప్పటికి గుర్తు ఉండేలా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలే పెళ్లి తంతు పూర్తి చేసుకుని కార్యక్రమాలు ముగించుకుని వచ్చేసిన కొత్త జంట నేడు మళ్లీ బర్త్ డే వేడుకల సందర్బంగా సోషల్‌ మీడియాలో సందడి చేయబోతున్నారు.
Tags:    

Similar News