లెక్కలేసుకోకుండానే దిల్ రాజు వారు సినిమా తీశారట

Update: 2020-02-11 07:30 GMT
దిల్ రాజు సినిమా అన్నంతనే లెక్కలు చాలానే ఉంటాయన్నది సినిమా ఇండస్ట్రీ అంతా చెప్పే మాట. అలాంటి ఆయన లెక్కలు వేసుకోకుండా సినిమా తీసే ఛాన్సు ఉందా? అంటే.. లేదనే మాట ఎవరినోటి నుంచైనా వస్తుంది. కానీ.. అందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు రాజుగారు. తాను తీసే ఏ సినిమా అయినా.. లెక్కలు వేసుకోకుండా తీయనని.. కానీ తన తాజా చిత్రం జాను మాత్రం అందుకు భిన్నమని చెప్పుకొచ్చారు.

జాను మూవీలో సమంత.. శర్వానంద్ ఇద్దరు కళ్లతోనే నటించారంటూ పొగడ్తల వర్షం కురిపించిన దిల్ రాజు.. తాను అనుకున్నంతగా సినిమా నడవటం లేదన్న విషయాన్ని తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఓపెన్ అయిపోయారని చెప్పాలి. సినిమాను ప్రమోట్ చేయటం లో దిల్ రాజు చేసిన తప్పులే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి సినిమాను స్లోగా ఇంజెక్టు చేయాల్సింది పోయి.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో లైట్ తీసుకున్న వైనానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

జానుకు ఒరిజినల్ 96ను మరిచేలా ఎవరూ తీయలేరన్న ప్రచారానికి చెక్ పెట్టేలా చేయటంలో ఫెయిల్ కావటం.. అప్పటికే చాలామంది ఓటీటీ ఫ్లాట్ ఫాం మీదా.. ఇతర వేదికల మీద చూసేయటం కూడా జాను ఓపెనింగ్స్ ను దెబ్బేసిందన్న మాట వినిపిస్తోంది. జాను ఒరిజినల్ చూసినోళ్లు.. దాని ఫీల్ ను తెలుగులో చూసి మిస్ అవుతామన్న భావనతో చూడలేదన్న మాట వినిపిస్తోంది.

ఈ టాక్ అంతకంతకూ పెరిగి పోయి.. కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తుండటం తో దిల్ రాజువారు ఓపెన్ అయ్యారంటున్నారు. తన తీరును భిన్నంగా లెక్కలు వేసుకోకుండా తీసిన సినిమాను.. ఎంకరేజ్ చేయాలన్నారు. అప్పుడు మాత్రమే మంచి సినిమాలు చేయగలమని చెప్పటం చూస్తే.. రాజుగారు తన తప్పుల్ని ప్రేక్షకుల మీద నెట్టేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది. మీలాంటోళ్లు ఇలా మాట్లాడేస్తే ఎలా సార్?


Tags:    

Similar News