‘సామ్ జామ్’షోకి సమంత పారితోషికం ఎంతో తెలుసా?

Update: 2021-01-04 09:00 GMT
'ఆహా’ ఓటీటీలో ‘సామ్ జామ్’ పేరుతో కొనసాగుతున్న సెలబ్రిటీ టాక్ షోకు స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ షో.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సమంత హోస్ట్ చేస్తున్న విధానం అందరిచేతా ప్రశంసలు అందుకుంటోంది.

సమంత కెరీర్‌లో ఇది మొట్టమొదటి టాక్ షో. అయితే.. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించినందుకు సమంతకు ఎంత చెల్లిస్తున్నారు? అనే అంశం అందరికీ ఆసక్తి కలిగించేదే. అందుతున్న సమాచారం మేరకు.. ఈ షోను మొదటి సీజన్లో 10 ఎపిసోడ్లకు ప్లాన్ చేశారు. ఇందుకు గానూ సమంత 1.5 కోట్లు తీసుకుంటున్నారని వినికిడి. అంటే.. ఒక ఎపిసోడ్ కు రూ.15 లక్షలు తీసుకుంటున్నారన్నమాట.

అయితే.. పది ఎపిసోడ్లకు ఈ షోను ప్లాన్ చేసినప్పటికీ.. ఎనిమిది ఎపిసోడ్లతోనే ముగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణమేంటన్నది తెలియాల్సి ఉంది. చివరి ఎపిసోడ్ లో సమంత తన భర్త చైతూని ఇంటర్వ్యూ చేయబోతోంది.

తొలి ఎపిసోడ్‌‌లో ఈ షోకు విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చారు. సెకండ్ ఎపిసోడ్‌లో రానా దగ్గుబాటి పాల్గొన్నారు. ఇక ఎపిసోడ్-3లో బ్యాడ్మింటన్ దంపతులు పారుపల్లి కశ్యప్-సైనా నెహ్వాల్, నాలుగో ఎపిసోడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా పాల్గొన్నారు. ఎపిసోడ్ 5కు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రముఖ దర్శకుడు క్రిష్ హాజరయ్యారు. 6వ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి అలరించగా.. 7వ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ విచ్చేశారు.

ఆఖరి ఎపిసోడ్ కు నాగచైతన్య రానుండడంతో హైప్ క్రియేట్ అయ్యింది. సమంత-చైతూ రొమాన్స్, కెమిస్ట్రీ ఎలా ఉంటుందోనని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఈ ఎపిసోడ్ అన్నింటికన్నా హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. తద్వారా.. తొలి సీజన్‌కు గ్రాండ్ ముగింపు ఇవ్వాలని చూస్తున్నారట షో దర్శకురాలు నందిని రెడ్డి.
Tags:    

Similar News