• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లోఫర్‌ పాపకు ఎలాంటి...

లోఫర్‌ పాపకు ఎలాంటి బ్రేకిస్తాడో

By - Tupaki Desk
Update: 2015-11-09 11:30 GMT
మెగావారసుడు వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లోఫర్ ట్రైలర్ రిలీజైంది. పూరీ స్టైల్ మేకింగ్ - డైలాగ్స్ తో ఈ ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. పూరీ సినిమాల హీరో ఎలా ఉంటాడో.. ఖచ్చితంగా అదే లుక్ తో ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్. మరి హీరోయిన్ సంగతేంటి ? సాధారణంగా పూరీ జగన్ సినిమాలంటే హీరోయిన్ కేరక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్లకో వ్యక్తిత్వం ఉంటుంది. ఏదో పాటల కోసం హీరో మీద పడిపోయే టైపులో హీరోయిన్ పాత్రలు ఉండవు.

ఆయా పాత్రలకు కూడా తగిన ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం పూరీ స్టయిల్. లోఫర్ ట్రైలర్ లో హీరోయిన్ దిశా పటానీ అంతగా కనిపించలేదు. ఒకటి రెండు చోట్ల పరిగెడుతూ దర్శనిమిచ్చిందంతే. కనీసం దిశాతో ఓ పాట కూడా మెయిన్ ట్రైలర్ లో కనిపించకపోవడం ఆశ్చర్యకరమే. అలాగని హీరోయిన్ కి ఇంపార్టెన్స్ లేకుండా సినిమా తీసే టైప్ కాదు పూరి. ఇలా చేయడానికి స్టోరీ ప్రకారం పక్కా రీజన్ ఉండొచ్చని అనుకుంటున్నారు. నిజానికి ఇలా పెర్ఫామెన్స్ - ఇంపార్టెన్స్ ఉండే కేరక్టర్స్ కాబట్టే.. ఆశిన్ - హన్సిక లాంటి వాళ్లు టాప్ స్టేజ్ కి వెళ్లగలిగారు. అఫ్ కోర్స్ - నేనింతేలో కనిపించిన శియా గౌతమ్ - నేహా శర్మ వంటి వారు అడ్రస్ లేరనుకోండి.

మరి ఇప్పుడు దిశా పటానీకి ఎలాంటి కేరక్టర్ ఇవ్వనున్నాడో అనే ఆసక్తి నెలకొంది. పూరీ తెచ్చిన హీరోయిన్స్ - ఐటెం గాళ్స్ కి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంటుంది. ఒకవేళ సినిమా హిట్ అయితే మాత్రం.. క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు లోఫర్ హీరోయిన్ దిశాపటానీ ఫ్యూచర్ తెలియాలంటే మాత్రం... రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.  ఇకపోతే ట్రైలర్‌ లో అమ్మడి గ్లామర్‌ కేకో కేక. అది సంగతి.
Tags:    
  • Varun Tej 
  • Disha Patani 
  • Loafer Movie 
  • Telugu NEws 

Similar News

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS