డైరెక్టర్ సుక్కు బృందానికి షాకిచ్చిన బాలీవుడ్ సుందరి.. ఎలా అంటే??

Update: 2020-12-29 07:50 GMT
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో బ‌న్నీ లారీడ్రైవరుగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ క‌థ‌, క‌థనం గురించి ప‌క్క‌న పెడితే.. డైరెక్టర్ సుకుమార్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కి ఓ రేంజి క్రేజ్ ఉంది. బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే అ అంటే అమలాపురం, రింగ రింగా ఐటమ్ సాంగ్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయో తెలిసిందే. మళ్లీ అదే కాంబినేషన్ లో అంటే.. డైరెక్టర్, హీరోలే కాదు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకడే అవడంతో ఈ క్రేజీ కాంబో మళ్లీ అలాంటి మాస్ నెంబర్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు సినీ ఫ్యాన్స్. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని ఇదివరకే తెలిపింది చిత్రబృందం. ఈ విషయం పై మ్యూజిక్ డైరెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

'ఈ సినిమాకు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మా కాంబినేషన్లో ఈసారి కూడా ఓ మాంచి ఐటమ్ సాంగ్ ఉంటుంది. మాస్ మ్యూజిక్ తో పాటు మంచి లిరిక్స్ కూడా డిఎస్పీ అందించినట్లు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ మూవీలో ఐటమ్ సాంగ్ అంటే డాన్స్ ఓ రేంజిలో ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తారు. అయితే బన్నీ సరసన ఐటమ్ సాంగ్ లో ఆడిపాడే హీరోయిన్ ఎవరినేది ఇంకా ఖరారు కాలేదు. ఇదివరకు పలువురిని సంప్రదించినా కుదరలేదట. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానిని సుక్కు బృందం సంప్రదించినట్లు సమాచారం. కానీ అమ్మడు కోటిన్నర అడిగి మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చిందట. పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని కలిస్తే ఇలా షాక్ ఇచ్చిందేంటని సుక్కు బృందం ఖంగుతిన్నారట. సుకుమార్ సినిమా అంటే పక్కా ఐటమ్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇదివరకే రంగస్థలంలో పూజా హెగ్డే జిగేల్ రాణిగా ఆడిపాడింది. మరి దిశా పటాని ప్రైస్ విషయంలో నిర్మాతలు ఆలోచించి కబురు చేస్తామన్నట్లు ఇండస్ట్రీ టాక్.
Tags:    

Similar News