ఉదయ్ కిరణ్‌ సినిమా.. అంతా సొల్లే

Update: 2018-05-18 04:36 GMT
కొత్త వాళ్లతో సినిమా తీయడంలో తేజ ఓ ట్రెండ్ సెట్టర్. తాను అనుకున్నట్లుగా ఎలాంటి ఒత్తిడులు లేకుండా మూవీ తీసేందుకు.. వీలైనంత వరకు కొత్త నటీనటులతోనే ప్రయత్నాలు చేస్తాడు. స్టార్ వాల్యూ లేకపోవడమే.. ఈయనకు చెందిన కొన్ని గత చిత్రాలు ఆడలేదని అంటారు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తున్నాడు కానీ.. తేజ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్లలో చెప్పుకోవాల్సిన హీరోలలో ఉదయ్ కిరణ్ కూడా ఉంటాడు.

2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం మూవీతో తేజ దర్శకుడిగా మారడమే కాదు.. ఉదయ్ కిరణ్ ను కూడా పరిచయం చేశాడు. అయితే.. నాలుగేళ్ల క్రితం ఈ కుర్ర హీరో కాలం చేశాడు. అనతి కాలంలోనే బాగా ఎదిగి.. అంతలోనే మళ్లీ పరాజయాలను ఫేస్ చేసిన ఉదయ్ కిరణ్ పై.. దర్శకుడు తేజ బయోపిక్ తీస్తున్నాడనే టాక్ వచ్చింది. తను పరిచయం చేసిన హీరో జీవితంపై.. తేజ లాంటి దర్శకుడు సినిమా తీయడం.. అందులోనూ అనుకోకుండా మరణించిన హీరోపై సినిమా అనగానే ఆసక్తి జనరేట్ అయింది.

అయితే.. ఈ విషయాన్ని దర్శకుడు తేజ ఖండించాడు. ఈ ప్రచారం ఎలా మొదలైందనే విషయం తనకు తెలీదని చెప్పిన తేజ.. అసలు తనకు అలాంటి ఆలోచన కూడా లేదని అన్నాడు. బయట వినబడుతున్న రూమర్లన్నీ కేవలం సొల్లే అని చెప్పాడు. ప్రస్తుతం తాను రానాతో మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నానని.. ఇది పూర్తిగా కమర్షియల్ యాంగిల్ లో మాత్రమే ఉంటుందని తేల్చేశాడు తేజ.
Tags:    

Similar News