ఎన్టీఆర్‌.. బన్నీ వైపు చూస్తున్న 'శంఖం' డైరెక్టర్‌

Update: 2020-10-14 07:50 GMT
తెలుగు ప్రేక్షకులకు శౌర్యం మరియు శంఖం సినిమాలతో సుపరిచితం అయిన దర్శకుడు శివ ప్రస్తుతం తమిళంలో స్టార్‌ డైరెక్టర్‌ గా దూసుకు పోతున్నాడు. సూపర్‌ స్టార్‌ లకు మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌ అయిన శివ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో 'అన్నాత్తే' అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు పూర్తి చేయబోతున్నారు. తమిళంలో వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న దర్శకుడు శివ తెలుగు హీరోలతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. గతంలో గోపీచంద్‌ తో రెండు సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఈసారి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అయిన ఎన్టీఆర్‌ లేదా అల్లు అర్జున్‌ లతో ఒక మాస్‌ మసాలా సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట.

చాలా కాలం తర్వాత ఈయన తెలుగు సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. కాని ప్రస్తుతానికి ఈయన కోరుకుంటున్న ఇద్దరు హీరోలు కూడా ఫుల్‌ బిజీగా ఉన్నారు. వీరిద్దరు కూడా 2022 వరకు ఖాళీగా లేరు. కనుక ఈ గ్యాప్‌ లో మరో తమిళ సినిమా చేస్తాడా లేదంటే వారిద్దరు కాకుండా మరో తెలుగు హీరోతో సినిమాను వచ్చే ఏడాది మొదలు పెట్టేస్తాడా అనేది చూడాలి. అన్నాత్తే మంచి ఫలితం సాధిస్తే ఖచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటించేందుకు తెలుగు స్టార్‌ హీరోలు అంతా కూడా క్యూ కట్టడం ఖాయం. ఆ సినిమా ఫలితాన్ని బట్టి శివ తెలుగు సినిమా ఉంటుందనిపిస్తుంది. తెలుగులో ఈయన చేసిన శౌర్యం సినిమా సూపర్‌ హిట్‌ అవ్వగా శంఖం సినిమా పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది. ఈసారి పెద్ద హీరోతో ఈయన సూపర్‌ హిట్‌ ను దక్కించుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News