• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్...

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వార‌సుడు డెబ్యూ హీరోగా

By - Tupaki Desk
Update: 2022-01-29 06:30 GMT
స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ తేజ్- కియారా అద్వానీ జంటగా RC 15 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. RC 15 షెడ్యూల్‌ను ముగించి కమల్ హాసన్ `భారతీయుడు 2` షూటింగ్ ను అతను ప్రారంభించనున్నట్లు సమాచారం.

శంకర్ కుమార్తె అదితి శంకర్ ఇటీవల డిగ్రీ పొంది ప్రొఫెషనల్ డాక్టర్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆమె కార్తీకి జోడీగా `విరుమాన్` అనే చిత్రంలో నటిస్తోంది. నటుడు శింబు సరసన నటించేందుకు ఆమె తన తదుపరి చిత్రం `కరోనా కుమార్`కి కూడా సంతకం చేసింది. అదితీ శంక‌ర్ అరంగేట్రం గురించి చ‌ర్చ సాగుతుండ‌గానే... త‌న‌ సోదరుడు దర్శకుడు శంకర్ కుమారుడు అర్జిత్ శంక‌ర్ కూడా తన నటనా రంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. అర్జిత్ శంకర్ తమిళంలో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నాడు. దర్శకుడు బాలాజీ శక్తివేల్ (శంకర్ అసోసియేట్) ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అర్జిత్ ఇప్ప‌టికే నటన - ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ పొందాడు. త‌న‌ అరంగేట్రం అదిరిపోవాల‌ని క‌ల‌లుగంటున్నాడు. కోలీవుడ్ లో అర్జిత్ ఎంట్రీకి సంబంధించి ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. మీడియా సమాచారం కూడా లేదు. అయితే బాలాజీ శక్తివేల్ ఇంత‌కుముందు ప్రేమిస్తే (కాద‌ల్) లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని తెర‌కెక్కిస్తార‌ని ఇందులో అర్జున్ కి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర ల‌భించింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శంక‌ర్ స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
Tags:    
  • Shankar 
  • Shankar Movies 
  • Shankar Rc15 
  • Shankar Son 
  • Shankar Son Movie 
  • Arjith Shankar 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS