ఆ దర్శకుడిని పీవీపీ పిలిచాడట

Update: 2016-10-25 13:30 GMT
‘బ్రహ్మోత్సవం’ తర్వాత కొంచెం స్లో అయ్యాడు పొట్లూరి వరప్రసాద్. ఇప్పటిదాకా ఆయన భారీ సినిమాలే చేశాడు. ఐతే ఇకపై చిన్న.. మీడియం బడ్జెట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లున్నాడు. ఆల్రెడీ ‘రాజు గారి గది’ ఫేమ్ ఓంకార్ దర్శకత్వంలో ఒక హార్రర్ కామెడీ ప్లాన్ చేస్తున్న పీవీపీ.. గత శుక్రవారం విడుదలైన ‘నందిని నర్సింగ్ హోం’తో దర్శకుడిగా పరిచయమైన పి.వి.గిరితో సైతం ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ విషయాన్ని గిరినే స్వయంగా వెల్లడించాడు. ‘నందిని నర్సింగ్ హోం’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ అతనీ విషయం తెలిపాడు. ‘‘పీవీపీ నుంచి పిలుపు వచ్చింది. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తా’’ అని పి.వి.గిరి తెలిపాడు.

ఇక ‘నందిని నర్సింగ్ హోం’ రిజల్ట్ గురించి గిరి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని విడుదలకు ముందు కృష్ణ గారికి చూపించాం. ఆయన జడ్జిమెంట్ మీద అందరికీ నమ్మకం. ఆయన సినిమా చూసి బాగుందన్నారు. చివరి 20 నిమిషాలు కట్టిపడేసిందని చెప్పారు. జీవితంలో డబ్బే ముఖ్యం కాదు. తల్లిదండ్రులు.. మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తులూ ముఖ్యమనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించాం. విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రిలో జరిగిన సంఘటన స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. ఈ చిత్రాన్ని కన్నడలోనూ పునర్నిర్మిస్తున్నాం. దర్శకుడెవరో ఇంకా నిర్ణయించలేదు. నా తొలి సినిమా చేసిన సంస్థలోనే మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. అన్ని జానర్లలోనూ సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం’’ అని తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News