• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మారుతి లైఫ్ లో ఈ కిక్...

మారుతి లైఫ్ లో ఈ కిక్ గురించి విన్నారా?

By - Tupaki Desk
Update: 2016-10-15 11:30 GMT
కష్టపడకుండా వచ్చే దానిపై ఆశపడకు - కష్టపడకుండా వచ్చేది ఎప్పటికీ నిలవదు - కష్టపడి సంపాదించింది ఎప్పటికీ పోదు... రజనీకాంత్ సినిమాలో డైలాగులా అనిపించినా ఇది వాస్తవమనేది అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారంతా లాటరీలు కొట్టి పైకొచ్చినవారు కాదు - ఎంతో కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుకుంటూ, నిర్ధేశించుకున్న గమ్యాన్ని ఎంచుకున్న మార్గాన్ని ప్రేమిస్తూ పైకొచ్చినవారు. వారిలో యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కూడా ఒకరు. థియేటర్ పక్కనున్న స్టిక్కరింగ్ షాపులో పనిచేస్తూ.. ఆ థియేటర్ లో బోర్డులు - స్టిక్కరింగ్ పనులు ఏమైనా ఉంటే యజమాని పిలుపు మేరకు వెళ్లి చేసే ఒక వ్యక్తి ఆల్ట్రేషన్ అనంతరం అదే థియేటర్ ఓపెనింగ్ ముఖ్య అతిధిగా వెళ్తే... ఆసమయంలో ఆ కుర్రాడు పొందే కిక్కు - ఆ థియేటర్ యజమానికి ఆశ్చర్యం - ఆనందం కలగలిపి తగిలే షాక్ భలేగా ఉంటాయి కదా. ఆ సంగతులు వివరంగా తెలుసుకోవాలంటే...

పదిహేనేళ్ల క్రితం బందరులోని సిరి వెంకట్‌ - కృష్ణ కిషోర్‌ థియేటర్‌ పక్కనే ఉన్న చిన్న స్టిక్కరింగ్‌ షాప్‌ లో పనిచేసేవాడు నేటి యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి. అప్పుడప్పుడు ఆ థియేటర్‌ లో బోర్డులు - స్టిక్కరింగ్‌ పనులు ఏమైనా ఉంటే ఓనర్‌ ఈ కుర్రాణ్నే పిలిచేవాడు. ఆ పిలుపుకోసం ఈ కుర్రాడు ఆశగా ఎదురుచూసేవాడు. ఎందుకంటే మనోడికి సినిమా అంటే పిచ్చి కాదు అంతకు మించి కాబట్టి. కట్ చేస్తే... పదిహేనేళ్ల తర్వాత అల్లు అరవింద్‌ - దిల్‌ రాజు - యువీ క్రియేషన్స్‌ ఒక సంస్థగా ఏర్పడి బందరులో అదే థియేటర్‌ ను అద్దెకు తీసుకుని రీమోడల్‌ చేశారు. ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టిన రోజు వారితో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తిని చూసి ఆ థియేటర్‌ ఓనర్‌ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ ముఖ్య అతిథి ఎవరో కాదు... అప్పట్లో అదే థియేటర్‌ లోనే చిన్న చిన్న పనులు చేసిన కుర్రాడు మారుతి. దాంతో ఒకపక్క ఆనందం - మరో పక్క ఆశ్చర్యం కలగలిపిన షాకి గురయ్యాడు ఆ యజమాని. ఆ సమయంలో మారుతి అనుభవించిన కిక్ ఎలా ఉండి ఉంటుందంటారు? లైఫ్ లో ఆమాత్రం కిక్ లేకపోతే ఏమి బాగుంటుంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Director Maruthi 
  • Telugu News 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS