• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాన్ పై డైరెక్ట‌ర్...

జాన్ పై డైరెక్ట‌ర్ కాన్ఫిడెన్స్.. ఫ్యాన్స్ పుల్ ఖుషీ

By - Tupaki Desk
Update: 2020-01-27 04:59 GMT
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడి గా`జిల్` ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న జాన్ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ప్ర‌భాస్ విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన త‌ర్వాత చిత్రీక‌ర‌ణలో స్పీడ్ పెంచారు. ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్ ను ఇట‌లీ లో పూర్తి చేసారు. రెండ‌వ షెడ్యూల్ ని హైద‌రాబాద్ లో ముగించారు. తాజాగా మూడ‌వ షెడ్యూల్ కూడా ఆదివారం తో హైద‌రాబాద్ లో పూర్త‌యింది. ఈ షెడ్యూల్ కోసం ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్స్ కోసం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసారుట‌. ఈ షెడ్యూల్ లో ప్ర‌భాస్- పూజా హెగ్దే మ‌ధ్య రొమాంటింక్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

సినిమా లో అవి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ గా నిలుస్తాయ‌ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ ధీమాను వ్య‌క్తం చేసారు. తాజాగా ఈ మూడు షెడ్యూల్స్ పై ద‌ర్శ‌కుడు రివ్యూ చెప్పారు. మూడు షెడ్యూల్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించామ‌ని.. మంచి ఔట్ పుట్ వ‌చ్చింద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వేసిన సెట్లు సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నున్నాయ‌ట‌. సినిమా మొద‌లైన త‌ర్వాత తొలిసారి ద‌ర్శ‌కుడు సినిమా అప్ డేట్స్ పై స్పందించ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

సాహో నిరాశ ప‌రిచిన నేప‌థ్యం లో వీలైనంత త్వ‌ర‌గా సినిమా ఫ‌స్ట్ లుక్...టైటిల్ విడుద‌ల చేయాల‌ని అభిమానులు కోరుతున్నారు. డైరెక్ట‌ర్ మాట‌ల‌తో అభిమానుల్లో ఆనందం మొద‌లైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన‌ సాహో ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌లేదు. దీంతో యూనిట్ స‌హా ఫ్యాన్స్ మౌనం వ‌హించారు. ఈ ప‌రాజ‌యం పై ప్ర‌భాస్ గానీ... సుజిత్ గానీ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యం లో జాన్ విష‌యంలోనూ వ‌న్ ఫిలిం డైరెక్ట‌ర్ కి అవ‌కాశ‌మిచ్చి డార్లింగ్ రిస్క్ తీసుకుంటున్నాడా? అన్న సందేహాలు త‌లెత్తాయి. తాజాగా ద‌ర్శ‌కుడి క్లారిటీతో సందేహాల‌న్నీ ప‌టాపంచ‌లు అయ్యాయి. అన్నిటికీ ఫుల్ స్టాప్ ప‌డింది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Tags:    
  • Director Confidence on Jaan Movie 
  • Jaan Movie Prabhas Look 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS