• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ వద్దకు...

ప్రభాస్ వద్దకు వెళ్లలేదు.. ఆ ఛాన్స్ కోసం వెయిటింగ్‌

By - Tupaki Desk
Update: 2021-11-08 15:30 GMT
దర్శకుడు మారుతి ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా అన్ని రకాల సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కెరీర్‌ ఆరంభంలో చిన్నా చితకా సినిమాలు చేసినా ఆ తర్వాత తర్వాత మంచి సినిమాలనే చేశాడు. ఒక వైపు భలే భలే మగాడివోయ్‌ అంటూ మంచి ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందించిన సినిమాలను తీయడంతో పాటు బాబు బంగారం వంటి ఒక స్టార్‌ హీరో సినిమాను కూడా చేశాడు. ఒక వైపు భారీ సినిమాలను చేస్తూనే మరో వైపు మంచి రోజులు వచ్చాయి అనే చిన్న తరహా సినిమాలను తక్కువ బడ్జెట్‌ తో రెండు నెలల వ్యవధిలో ముగించేశాడు. ఇలా రకరకాల సినిమాలను చేస్తున్న మారుతికి మెగాస్టార్‌ చిరంజీవి నుండి ఆఫర్‌ వచ్చిందనే వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో చిరంజీవి వరుసగా చిన్న దర్శకులతో కొత్త దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తనను చూసి పెరిగి.. తనను అభిమానిస్తూ సినిమాల్లో అడుగు పెట్టిన వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి మారుతికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారనే వార్తలు గుప్పుమంటున్నారు.

చిరంజీవి తో సినిమా అయిన తర్వాత యూవీ క్రియేషన్స్‌ లో ప్రభాస్‌ హీరోగా మారుతి సినిమా ఉండబోతుంది అనే వార్తలు మొదలు అయ్యాయి. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో మారుతి సినిమాలను తెరకెక్కించాడు. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు యూవీ వారికి మారుతిపై మంచి గురి ఏర్పడింది. అందుకే ప్రభాస్‌ తో సినిమాకు కథను సిద్దం చేసుకోవాల్సిందిగా మారుతికి చెప్పారంటూ కొందరు.. లేదు మారుతి మరియు ప్రభాస్ ల కాంబో మూవీ కన్ఫర్మ్ అయ్యింది. 2023 లేదా 2024 లో పట్టాలెక్కడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మారుతి నుండి ఈ పుకార్లకు ఒక క్లారిటీ లభించింది. ప్రభాస్ హీరోగా సినిమా ను నేను చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని మారుతి తేల్చి చెప్పాడు.

నేను కథను తయారు చేసుకున్న తర్వాత ఆ కథ ఎవరికి సూట్‌ అవుతుందో ఆలోచించి ఆ తర్వాత ఆ హీరో వద్దకు వెళ్తాను తప్ప.. ఒక హీరో ఆఫర్‌ ను తీసుకుని ఆ తర్వాత కథను తయారు చేసుకోను అన్నాడు. ప్రభాస్ వద్దకు నేను కథను తీసుకుని వెళ్లలేదు. కాని ప్రభాస్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం ఎవరు వద్దనుకుంటారు. ఆ అవకాశం వస్తే తప్పకుండా నేను చేస్తాను. ప్రభాస్ కు తగ్గ కథను నేను రాసుకుంటే ఖచ్చితంగా నేను ఆయనకు ఆ కథను వినిపిస్తాను అంటూ మారుతి చెప్పుకొచ్చాడు. అయితే చిరంజీవితో సినిమా విషయంలో మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇటీవలే మంచి రోజులు వచ్చాయి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారుతి ఆ తర్వాత గోపీచంద్‌ తో పక్కా కమర్షియల్‌ మూవీ తో రాబోతున్నాడు. గోపీచంద్‌ మరియు రాశిఖన్నా జంటగా రూపొందుతున్న పక్కా కమర్షియల్ సినిమా ఖచ్చితంగా మంచి ఎంటర్ టైన్మెంట్‌ ను ఇస్తుందని మారుతి చెబుతున్నాడు. పక్కా కమర్షియల్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే వెంటనే చిరంజీవి తో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Tags:    
  • Director Maruthi 
  • Prabhas 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS