• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ సినిమాలో 'ఖిలాడీ'...

పవన్ సినిమాలో 'ఖిలాడీ' బ్యూటీ..?

By - Tupaki Desk
Update: 2022-02-14 17:30 GMT
పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ''భవదీయుడు భగత్ సింగ్''. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అప్పుడెప్పుడో వచ్చింది. అయితే పవన్ ఇతర కమిట్మెంట్స్ - కరోనా పరిస్థితుల నేపథ్యంలో సెట్స్ మీదకు వెళ్ళడానికి ఆలస్యమైంది. హీరో డేట్స్ ఇచ్చిన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే 'భవదీయుడు..' సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇందులో నటించే హీరోయిన్ గురించి అనేక రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. చివరగా బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో పవన్ కు జోడీగా ఎంపిక చేయబడిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ చిత్రంలో హరీష్ శంకర్ మరో హీరోయిన్ డింపుల్ హయాతీకి చోటు కల్పించబోతున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అమ్మడు నటించిన మూడు సినిమాలు మూడు నెలల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. హయాతి బాలీవుడ్ డెబ్యూ 'అత్రాంగిరే' మూవీ డిసెంబర్ లో ఓటీటీ విడుదలై విశేష స్పందన తెచ్చుకుంది. ఇందులో ధనుష్ ప్రేయసిగా సెకండ్ హీరోయిన్ గా డింపుల్ కనిపించింది.

ఆ తర్వాత విశాల్ సరసన ఆమె నటించిన 'సామాన్యుడు' సినిమా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ లో పర్వాలేదనిపించిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. ఇదే క్రమంలో లేటెస్టుగా మాస్ మహారాజా రవితేజతో కలిసి 'ఖిలాడీ' మూవీతో పలకరించింది డింపుల్. భారీ అంచనాల నడుమ మొన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

రెండు బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ రావడం అనేది ఏ హీరోయిన్ కెరీర్ కైనా పెద్ద దెబ్బే. కాకపోతే అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుచెప్పకుండా.. గ్లామర్ షోతో ఆకట్టుకోవడంతో డింపుల్ హయాతికి బాగానే క్రేజ్ వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో ఆమెకు మంచి రోల్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

డింపుల్ గతంలో హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన  'గడ్డలకొండ గణేష్' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందాల భామకు దర్శకుడు మరో అవకాశం ఇస్తున్నారనే వార్తల్లో ఎంత నిజముందో చూడాలి. ఇకపోతే గోపీచంద్ - శ్రీవాస్ కాంబోలో రూపొందే సినిమాలో ఈ బ్యూటీనే హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
 
ఇంతకముందు 'అభినేత్రి 2' అనే ద్విభాషా చిత్రంలో నటించిన ఈ తెలుగమ్మాయికి.. తమిళ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయని టాక్. మరి 'గల్ఫ్' హీరోయిన్ కెరీర్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    
  • Dimplehayathi 
  • khiladi 
  • raviteja 
  • harishshankar 
  • pawankalyan 
  • tollywood 
  • latestnews 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS