RRR టీమ్ కు దిల్ రాజు స్పెషల్ గిఫ్ట్స్

Update: 2023-03-23 10:16 GMT
దర్శకుడు ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు వరించాయి. సినిమా వచ్చి ఏడాది దాటినా ... ఆ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు.

ఇక తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలకు వ్యాపింప చేసిన ఆర్ఆర్ఆర్‌ టీమ్‌కు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అభినందనలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ తరఫు నుంచి ఆర్ఆర్ఆర్‌ చిత్ర యూనిట్ కు ప్రత్యేకంగా గిఫ్ట్స్ అందజేశారు. ఇక అందులో గ్లోబ్‌, ప్రశంసా పత్రం, నాటు నాటు స్టెప్పు ఫొటో, క్లాప్‌ బోర్డు, మూవీ రీల్‌.. ఇలా సినీ ఇండస్ట్రీని ప్రతిబింబించేలా ఈ గిఫ్ట్‌ ను స్పెషల్‌గా డిజైన్‌ చేయించారు దిల్ రాజు.

ఈ మేరకు శిరీష్‌, హన్సిత, హర్షిత్‌తో కలిసి.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి, దానయ్య, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ లకు దిల్‌ రాజు గిఫ్ట్స్‌ అందజేశారు. వారికి కంగ్రాట్స్‌ కూడా చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎస్‌వీసీ ట్విటర్‌ ఖాతాలో తాజాగా విడుదల కాగా అది వైరల్ గా మారింది.
నెటిజన్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరిలో ఆర్ఆర్ఆర్‌ నుంచి నాటు నాటు పాట విజయం అందుకుని.. అకాడమీ అవార్డును గెలుచుకుంది. సంగీత దర్శకుడు కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా సత్తాను చాటారు.

 ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే.. రామ్‌చరణ్‌ హీరోగా దిల్‌రాజు ఓ సినిమాని నిర్మిస్తున్నారు. దీని వర్కింగ్ టైటిల్ RC 15. ఇక ఈ సినిమను దర్శకుడు శంకర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా శరవేగంగా సాగుతుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా.... కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News