• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రూ.200 కోట్ల భరణాన్ని...

రూ.200 కోట్ల భరణాన్ని సమంత రిజెక్టు చేసిందా?

By - Tupaki Desk
Update: 2021-10-04 09:30 GMT
హాట్ టాపిక్ గా మారిన సమంత - నాగ చైతన్య విడాకుల విషయానికి సంబంధించి బోలెడన్ని విషయాలు చర్చకు వస్తున్నాయి. అందులో నిజం ఎంత? అబద్ధం? ఎంత అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. వారిద్దరి విడాకులకు కారణం ఏమిటి? ఎందుకంత కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు? అన్న సందేహాలతో పాటు.. కొందరు సమంతను సమర్థిస్తుంటే.. మరికొందరు నాగచైతన్యకు మద్దతుగా నిలుస్తున్నారు.

అత్యధికులు మాత్రం  చూడముచ్చటైన ఈ జంట విడిపోవటం ఏమిటి? నో.. అలా జరగకుండా  ఉండాల్సింది. ఎవరో ఒకరు ఎంతో కొంత తగ్గి ఉంటే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మొత్తంగా విడాకుల నిర్ణయాన్ని అత్యధికులు రిజెక్టు చేస్తున్న పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే.. గడిచిన ఆర్నెల్లుగా చైతన్య - సమంత విడాకుల విషయం వార్తల రూపంలో వచ్చినా.. అది వాస్తవమని అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేకపోతున్న వారే ఎక్కువ మంది.

ఇదిలాఉంటే.. ఈ విడాకులకు సంబంధించి ఒక ఆంగ్ల మీడియాకు సంబంధించి ఒక వైరల్ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం.. విడాకుల నేపథ్యంలో సమంతకు భరణం రూపంలో రూ.200కోట్ల మొత్తాన్ని నాగచైతన్య ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. తనకు ఒక్క పైసా కూడా వద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా భార్యభర్తలు విడిపోతే.. భర్త ఆస్తి నుంచి కొంత వాటా భరణం రూపంలో భార్యకు దక్కుతుంది. తాజాగా సమంతకు అక్కినేని కుటుంబం నుంచి ఎంత మొత్తం భరణంగా వస్తుందన్నది పెద్ద చర్చగా మారింది.

ఇలాంటివేళ.. సమంత అక్కినేని వారు ఆఫర్ చేసిన భారీ మొత్తానికి నో చెప్పటమే కాదు.. ఒక్క పైసా కూడా తనకు అక్కర్లేదన్న మాట ఆమె నోటి నుంచి వచ్చినట్లుగా సదరు కథనంలో పేర్కొన్నారు.  ఇదంతా తమకు ఇరువురి సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారంతో చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. తనకు భరణం అవసరంలేదని.. సొంతంగా తాను సంపాదించుకోగలనని సమంత స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. విడాకుల వ్యవహారంతో సమంత మనసు ముక్కలూందని.. దీని నుంచి ఆమె బయటకు రావటానికి చాలా కాలం పడుతుందన్న ప్రచారం సాగుతోంది. మరి.. భరణం విషయంలో తాజాగా బయటకు వచ్చిన వార్తల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.
Tags:    
  • Samantha 
  • Samantha instagram 
  • Samantha naga chaitanya divorce 
  • Samantha Divorce 
  • Naga chaitanya samantha separation 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS