• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సినిమాలోని పాత స్టిల్...

ఆ సినిమాలోని పాత స్టిల్ బయటకు తీసి ఆ హీరోయిన్ ‘పెళ్లి’ చేసేశారు

By - Tupaki Desk
Update: 2022-09-04 05:07 GMT
పోటాపోటీగా నడిచే టీవీ చానళ్ల కారణంగా.. కొంతకాలం క్రితం సెలబ్రిటీల్ని అదే పనిగా చంపేసే ప్రోగ్రాం ఒకటి నడిచింది. ఎవరైనా ప్రముఖుడు అనారోగ్యంతో ఆసుపత్రి చేరితే చాలు.. పరిస్థితి విషమంగా ఉందన్న మాట డాక్టర్ల నోటి నుంచి వస్తే.. ఆ తర్వాతి పన్నెండు గంటల్లో ఏదో క్షణంలో సదరు ప్రముఖుడు కాలం చెందారన్న బ్రేకింగ్ న్యూస్ పడేది. కాసేపటికే నాలుక మడతపెట్టేసి.. గాల్లో కలిసిపోయిన సిగ్నల్స్ ను.. అక్కడితో ఆపేసి ఏమీ తెలీనట్లుగా గమ్మున ఉండేవారు. టీవీ చానళ్ల దూకుడును సరిగా అర్థం చేసుకోక ఫాలో అయినోళ్లు మాత్రం పులిహోర అయ్యేవారు.

టీవీ ఛానళ్లకు వంద రెట్లు దూకుడుగా వ్యవహరించటంతో పాటు.. నిజానిజాల కంటే కూడా.. సంచలనాలే కేరాఫ్ అడ్రస్ అన్నట్లు వ్యవహరిస్తూ తమకు తోచిన అంశాల్ని వార్తలుగా క్రియేట్ చేసే క్రియేటివిటీ సోషల్ మీడియా సొంతం. ఇందులో భాగంగా.. ఎప్పుడు ఎవరిని ఎలా వాడేయాలో సోషల్ మీడియా బుద్ధజీవులకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. తాము వార్తగా ప్రచారం చేయాలనుకునే విషయానికి సంబంధించి ఏదో ఒక ఫోటోనో.. మరొకటో ఒకటి పట్టుకొని.. అందంగా కథ అల్లేసి.. దానికి అవసరమైన లాజిక్ ఒకటి జోడించేసి ప్రపంచం మీదకు వదిలేస్తే.. అది తిరిగితిరిగి ఎవరినైతే ఉద్దేశించి పోస్టు పెట్టారో.. సదరు ప్రముఖుడు స్వయంగా స్పందించి.. అయ్యలారా.. అమ్మలారా అసలు విషయం ఇది అని చెప్పే పరిస్థితిని తీసుకొస్తున్నారు.

అప్పట్లో టీవీ చానళ్లు ప్రముఖుల్ని తమకు తోచినట్లుగా ఒకే ప్రముఖుడ్ని రెండు..మూడుసార్లు చంపేసేవో.. ఇప్పుడు సోషల్ మీడియా కొందరు హీరోయిన్లకు పెళ్లిళ్లు చేసేయటం.. గర్భధారణ లాంటివి చేసేస్తున్నారు. తాజాగా అలాంటి కథనాల బారిన పడి.. 'అసలు విషయం ఇదండి' అంటూ క్లారిటీ ఇచ్చారు సినీ నటి  అమృత అయ్యర్. తాజాగా ఆమెకు పెళ్లి జరిగినట్లుగా ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది.

అచ్చం పెళ్లి కుమార్తె మాదిరి క్యాస్టూమ్.. దాని పక్కనే కనిపించని.. కనిపించేలా వరుడి ముఖం కూడా ఫోటోలో ఉండటంతో చాలామంది ఆమెకు పెళ్లి అయిపోయిందనుకున్న పరిస్థితి. సినీ నటి కావటంతో నచ్చినవాడితో సీక్రెట్ గా పెళ్లి చేసుకుందేమో.. సోషల్ మీడియా పుణ్యమా అని బయటకు వచ్చిందన్నట్లుగా బిల్డప్ జరిగింది. ఇది కాస్తా చివరకు అమృత అయ్యర్ వరకు వెళ్లటం.. ఆ ఫోటోను ఆమె షేర్ చేస్తూ.. గతంలో తాను నటించిన 'వనక్కమ్ దా మప్పిలై' సినిమాలోని స్టిల్ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. తనకు పెళ్లి కాలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.

దీంతో.. ఆమెకు పెళ్లి నిజంగా కాలేదన్నది ఫ్రూవ్ అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టుతో.. తమిళ మీడియా సైతం ఆమె పెళ్లి మీద కొన్ని సందేహాలతో వార్తలు వండేశాయి.  30 రోజుల్లో ప్రేమించటం ఎలా? మూవీలో అమ్మాయిగారుగా సందడి చేసిన ఆమె రెడ్ సినిమాలో గాయత్రిగా.. అర్జున ఫల్గుణ చిత్రంలో శ్రావణిగా నటించి మెప్పించిన అమృతకు పెళ్లి కాలేదన్న విషయం ఆమెకు ఆమె క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియానా మజాకానా!
Tags:    
  • Amritha Aiyer 
  • Kollywood 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS