• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బీప్ సాంగ్ దెబ్బ.. అతణ్ని...

బీప్ సాంగ్ దెబ్బ.. అతణ్ని పీకేశారు

By - Tupaki Desk
Update: 2016-01-07 13:57 GMT
హీరో ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ల మధ్య ఉన్న స్నేహం గురించి కోలీవుడ్లో అందరికీ తెలుసు. రజినీకాంత్ భార్య మేనల్లుడైన అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది ధనుషే. వాళ్లిద్దరి కాంబినేషన్లో 3, వేల ఇల్ల పట్టాధారి (రఘువరన్ బీటెక్), తంగ మగన్ (నవ మన్మథుడు) లాంటి పెద్ద మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. దీని తర్వాత అనిరుధ్ తో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టే ఉద్దేశంతో తన కొత్త సినిమా ‘కోడి’లోనూ మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు ధనుష్. కానీ ‘బీప్ సాంగ్’ గొడవ పుణ్యమా అని అనిరుధ్ ను ఈ చిత్రం నుంచి తప్పించక తప్పలేదు ధనుష్. ముందు అనిరుధ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ చేసిన ధనుష్.. అనూహ్యంగా అతణ్ని తప్పించి సంతోష్ నారాయణ్ ను ఎంచుకున్నాడు.

శింబు రాసి, ఆలపించిన ‘బీప్ సాంగ్’కు బాణీలు కట్టింది అనిరుధే. ఇందులో అనిరుధ్ తప్పేమీ లేదని శింబు చెప్పినా.. దానికి బాణీలు కట్టాడు కాబట్టి అతణ్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. అసలీ పాట బయటికి రావడానికి అనిరుధే కారణమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. శింబు సరదాగా ఆ పాటను తనకు పంపితే.. అతనో హీరోకు పంపించడం.. ఆ తర్వాత అది వాట్సాప్ లోకి రావడం.. పెద్ద గొడవ చెలరేగడం.. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. ‘బీప్ సాంగ్’ గొడవ తర్వాత తమిళనాట శింబు అన్నా.. అనిరుధ్ అన్నా మహిళలు మండి పడుతున్న నేపథ్యంలో ధనుష్ కూడా జాగ్రత్త పడ్డాడు. అనిరుధ్ వల్ల తన సినిమాకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని తమ స్నేహాన్ని కూడా పక్కనబెట్టేసి అతడి స్థానంలో సంతోష్ ను ఎంచుకున్నాడు. మొత్తానికి ‘బీప్ సాంగ్’ పుణ్యమా అని అనిరుధ్ కు పెద్ద దెబ్బే పడింది. మున్ముందు అతను ఇంకెన్ని దెబ్బలు తింటాడో?
Tags:    
  • Dhanush 
  • Anirudh 
  • Santosh Narayanan 
  • Kodi 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS