త్రిషకు బ్రేకివ్వడానికి యోగి దిగుతున్నాడు

Update: 2016-10-01 04:38 GMT
ఈ మధ్యకాలంలో అస్సలు త్రిషకు తెలుగులో మాత్రం చచ్చినా కలసి రాలేదు. 2011లో దమ్ము సినిమాతో మొదలైన అమ్మడి పతనం.. అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎన్నో డబ్బింగ్ సినిమాలు వచ్చినా కూడా ఈమెకు తెరిపిమాత్రం లేనేలేదు. నాయకి కూడా ముంచేసింది. చివరకు ఎంతవాడు గానీ వంటి హైప్ వచ్చిన సినిమాలు కూడా ఫ్లాపే అయ్యాయి. ఇప్పుడు ఒక ఆశాకిరణం త్రిష్‌ కెరియర్లో మెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా..

అందుకే ''ధర్మ యోగి'' అంటూ మనముందుకు వస్తున్నాడు ధనుష్‌. మనోడు డబుల్ యాక్షన్ లుక్స్ తో ఇప్పటికే తమిళంలో ''కోడి'' అంటూ ఇరగదీశాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా మామూలుగా లేదు. అందుకే ఇప్పుడు ఆ సినిమాను ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేస్తారట. ఇందులో నెగెటివ్ పాత్రను పోషించే ధనుష్‌ పెయిర్ గా త్రిష్‌ ఒక పవర్‌ ఫుల్ రోల్ చేసింది. ఒకవేళ ఈ సినిమా క్లిక్కయ్యి ఈ రోల్ కూడా క్లిక్కయితే మాత్రం తెలుగులో త్రిషకు కాస్త ఊపొచ్చే ఛాన్సుంది. కాకపోతే ఇప్పటికే అమ్మడు ముఖంలో ఆంటీ లుక్స్ వచ్చేయడంతో యంగ్ హీరోలు మాత్రం ఎగబడే అవకాశం లేదులే.

తమిళంలో కూడా త్రిష చేతిలో రెండు హారర్ సినిమాలున్నాయి. వీటిలో ఒక్కటి క్లిక్కయినా కూడా అమ్మడు బ్యాక్ టు ఫామ్ వచ్చేయొచ్చు అనుకుంటోంది. చూద్దాం మరి తెలుగు అండ్ తమిళంలో మరోసారి పుంజుకుంటుందేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News