సామ్.. సైలెంట్ గా కౌంటర్ ఇచ్చేసింది!

స్టార్ హీరోయిన్ సమంత.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది

Update: 2024-05-06 10:10 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ ఇస్తుంటోంది. ఫ్యాన్స్ తో డైలీ టచ్ లో ఉంటోంది. త్వరలోనే సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇటీవల తన బర్త్ డే రోజు.. కొత్త సినిమా అనౌన్స్ చేసింది సామ్. తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌' బ్యానర్ పై 'మా ఇంటి బంగారం' పేరుతో మూవీని ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు మాత్రం వెల్లడించలేదు సమంత. కానీ అప్పుడే ఆ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మయోసైటిస్‌ బారినపడ్డ సమంత.. అనేక నెలల తర్వాత కొత్త మూవీ అనౌన్స్ చేయడంతో హైప్ క్రియేట్ అయింది.

రీసెంట్ గా సమంత ఇన్ స్టా పోస్ట్ పై రకరకాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత బాత్ టవల్ చుట్టుకుని ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్ చేస్తున్న పిక్ షేర్ చేసింది. ఆ బాత్ వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వివరించింది. కానీ కొందరు ఆకతాయిలు.. సమంతకు చెందిన ఓ ఫేక్ ఫోటోను నెట్టింట వైరల్ చేశారు. సమంత న్యూ*డ్ పిక్ ను పోస్ట్ చేసి డిలీట్ చేసిందని తప్పుడు ప్రచారం కూడా చేశారు. కానీ సామ్ మాత్రం.. ఎలాంటి న్యూ*డ్ పిక్ పోస్ట్ చేసినట్లు లేదు.

Read more!

అయితే సమంత.. తన ఫేక్ ఫోటో వైరల్ అవ్వడంతో తాను ఆవిరి బాత్ కోసం చేసిన పోస్ట్ ను డిలీట్ చేసింది. ఆ తర్వాత ఒక కొటేషన్ ను పోస్ట్ చేసి పరోక్షంగా స్పందించింది. ‘‘మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించడమే నిజమైన విజయం’’ అన్న క్యాప్షన్ ను షేర్ చేసింది. తన పిక్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలనే సామ్ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. అసలు సమంత ఎలాంటి న్యూ*డ్ ఫొటో షేర్‌ చేయలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. కావాలనే ఫేక్‌ ఫోటో క్రియేట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంకొందరు మాత్రం వైరల్ అవుతున్న ఫోటోలో లాకెట్ సేమ్.. సామ్ ది లానే ఉందని అంటున్నారు. అయితే అది ఫేక్ ఫోటో అని, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. మరేం అవుద్దో చూడాలి.

Tags:    

Similar News