నగ్నంగా నిలబడినా.. అంటున్న దీపిక

Update: 2018-11-16 06:05 GMT
ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ పెళ్ళి చేసుకున్నారంటే అందరి దృష్టి వారిమీదే ఉంటుంది కదా? రణవీర్ సింగ్ - దీపిక పదుకొనే విషయంలో  ఇప్పుడు అలాగే జరుగుతోంది.  ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న దీప్-వీర్ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.  ఒకరంటే ఒకరికి ఉన్న అభిమానం గురించి గతంలో వారిద్దరూ మాట్లాడిన విషయాలు కూడా ఇప్పుడు మళ్ళీ చర్చకొస్తున్నాయి.

ఓ సందర్భంలో రణవీర్ మాట్లాడుతూ దీపిక చాలా బ్యూటిఫుల్ అని.. ఆమె కోసం తన జీవితాన్ని అంకితం చేయగలనని చెప్పాడు. సింపుల్ గా బ్యూటిఫుల్ గా చెప్పాడు కదా?  ఇక దీపిక మాత్రం కాస్త హార్డ్ గా.. బోల్డ్ గా రణవీర్ గురించి చెప్పింది.. "నా విషయంలో రణవీర్ ఏదీ గ్రాంటెడ్ గా తీసుకోడు.. నేను నగ్నంగా ఉన్నా నన్ను హర్ట్ చెయ్యడు. అందుకే తనపై నాకు అంత నమ్మకం."  స్టేట్ మెంట్ లు సింపుల్ గా ఉన్నా.. హార్డ్ గా ఉన్నా భావం మాత్రం ఒక్కటే.  ఆ భావం 'ఇద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ' అని మాత్రం అర్థం అవుతోంది.  

ఐదేళ్ళ స్ట్రాంగ్ లవ్ తర్వాత ఒక్కటైన జంట ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలవడం ఖాయమే.  ఇదిలా ఉంటే కార్పోరేట్ కంపెనీలు ఇద్దరు కలిసి నటించే యాడ్ల కోసం ఇప్పుడు దీప్ - వీర్ జంట వెంటబడడం మొదలుపెట్టాయట.
Tags:    

Similar News