ప్రభాస్ తో నటించడానికి భారీగా డిమాండ్ చేస్తోందట...!

Update: 2020-04-15 06:10 GMT
దర్శకధీరుడు రాజమౌళి వెండితెరపై సృష్టించిన అద్భుతం 'బాహుబలి'.. ఈ సినిమాలో హీరోగా నటించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ 'బాహుబలి' తర్వాత బాగా పెరిగి పోయిందని చెప్పవచ్చు. అదే ఊపులో గత ఏడాది అతిపెద్ద యాక్షన్ ఎంటరైనర్ 'సాహో'తో పలకరించాడు ప్రభాస్. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ కి మరికొంత క్రేజ్ వచ్చి చేరిందని చెప్పవచ్చు. ఆ సినిమా సౌత్ లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికి హిందీలో మాత్రం మాస్ ఆడియెన్స్ నుంచి క్లాస్ ఆడియెన్స్ వరకు అందరిని ఎట్రాక్ట్ చేసింది. ఆ ఏడాది రిలీజైన హిందీ సినిమాలకు ధీటుగా నిలిచి సాహో అనిపించుకుంది. ఆ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ కూడా మన యంగ్ రెబెల్ స్టార్ తో మళ్ళీ జోడీ కట్టడానికి రెడీ అనేసింది అంటే ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో చెప్పనవసరం లేదు. రీసెంటుగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ సైతం 'బాహుబలి' సినిమా చూసి నేను ప్రభాస్ కి ఫ్యాన్ అయ్యానని చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో నటించడానికి చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు ఉత్సాహం చూపిస్తుంటే ఒక హాట్ బ్యూటీ మాత్రం ఎవరు ఊహించని విధంగా రెమ్యునరేషన్ దగ్గర బేరమాడుతోందట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనె.

వైజయంతి ప్రొడక్షన్ లో 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్ పాత్ర కోసం ఈ భామని సంప్రదించగా అమ్మడు 20 నుంచి 25కోట్ల వరకు డిమాండ్ చేసిందట. పద్మావత్ సినిమా అనంతరం 15కోట్ల వరకు ఒక సినిమాకు అందుకుంటున్న ఈ హాట్ బ్యూటీ.. ప్రభాస్ మూవీ పాన్ ఇండియా మూవీ అని తెలిసి రెమ్యునేషన్ పెంచుతోందట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. దీపికా పదుకొనే టాలీవుడ్ ఆఫర్స్ విషయంలో ఇలా చేయడం మొదటిసారి కాదు.  ఎన్ని అవకాశాలు వచ్చినా కథ వినకుండానే చాలా సార్లు నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో కూడా దీపిక చాలా సార్లు సౌత్ నిర్మాతలతో డిస్కషన్ చేసి నచ్చక పోవడంతో నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన ఈ భామ మొదటి నుంచి సౌత్ ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటోందనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. మరి ప్రభాస్ 21వ సినిమా కోసం దీపిక ఆ రేంజ్ లో డిమాండ్ చేసిందనే వార్తలో ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News