• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్యా తమాషా హై గురూ!!

క్యా తమాషా హై గురూ!!

By - Tupaki Desk
Update: 2015-11-23 17:30 GMT
బాలీవుడ్ లో హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం విడిపోవడం సర్వసాధారణం. సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్ - సల్మాన్ ఖాన్ -కత్రినా కైఫ్ లతో పాటు.. పలు జంటలకు ఇలాంటి అనుభవం బాగానే ఉంది. అయితే.. విడిపోయిన వాళ్లు మళ్లీ కలిసి సినిమాలు చేసిన సందర్భాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. సల్లూభాయ్-కత్రినాలు ఓ మూవీలో కలిసి కనిపించారంతే.

ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిన తమాషాలో నటించిన రణబీర్ కపూర్ - దీపికా పదుకొణేలు కూడా మాజీ లవర్సే అని తెలుసు. అయితే.. వీళ్లిద్దరూ కలిసి ఇంటిమేట్ సీన్స్ ఉంటే సినిమా చేయడం, వీళ్ల స్టోరీకి దగ్గరగా ఉండే ప్రేమించుకుని విడిపోయే స్టోరీతో మూవీ చేయడం కాస్త విచిత్రమైన విషయమే. దీనికి మించి ముద్దు సీన్ లలో కెమిస్ట్రీ పండించేసిన వీళ్ల డెడికేషన్ ని ఎంతైనా పొగడాలి. ఏదోలే సినిమాకోసం అన్నిటికీ ఒప్పేసుకుని చేసేశారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రచారంలో కూడా ఇలాగే రెచ్చిపోతున్నారు ఈ తమాషా లవర్స్. ఢిల్లీ నుంచి ముంబై కి ట్రైన్ జర్నీ చేసేశారు. ఇంతియాజ్ ఆలీని పక్కన పెట్టుకుని మరీ.. ఈ లాంగ్ జర్నీలో పాలు పంచుకున్నారు. ఈ ప్రయాణంలో తోటి ప్రయాణికులతో రణబీర్ దీపికలు చేసిన సందడి, కంపార్ట్ మెంట్ లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

ఇంతగా ఓ సినిమా కోసం తమ పర్సనల్ ఫీలింగ్స్ ని పక్కన పెట్టేసిన జంట ఇప్పటివరకూ బాలీవుడ్ లో ఎవరూ లేరు. విడిపోవడం ఎలాగూ అయిపోయింది. ఇప్పుడు దాన్ని తలుచుకుని ఎందుకు ఫీల్ అవ్వడం అంటున్నారు వీళ్లిద్దరూ. అనడమే కాదు.. ఆ చెప్పే కబుర్లకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవును... వీళ్లిద్దరూ ఖచ్చితంగా ఆదర్శ మాజీ లవర్స్ జంటే.. కాదంటారా..
Tags:    
  • Deepika Padukone 
  • Ranbir Kapoor 
  • Deepika Ranbir Train Journey 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS