వందనం అంటున్న బాలనటుడు

Update: 2015-10-08 22:30 GMT
స్టార్ హీరోల వారసులు తమ తండ్రుల నట వారసత్వాన్ని అందుకుని హీరోలుగా  ఎంట్రీ ఇవ్వడం, బాల నటులుగా ప్రాచుర్యం పొందిన కొంతమంది హీరోలుగా రావడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్తేం కాదు. బాల నటుల విషయానికొస్తే బాలాదిత్య మొదలుకొని తనీష్ వరకూ ఎవరికివారు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. ఆ లిస్ట్ లో మరో పేరు చేరనుంది.

అతడు - పెదబాబు - ఆంధ్రుడు సినిమాల్లో బాల నటుడిగా అల్లరి చేసిన దీపక్ సరోజ్ హీరోగా వందనం అనే సినిమాతో పరిచయం కానున్నాడు. దీపక్ బాలనటుడిగా 40కి పైగా సినిమాలు చేసినా అతడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అన్నట్టు బోయపాటి తెరకెక్కించిన లెజెండ్ సినిమాలో  వయసులోని బాలయ్య పాత్రలో కనపడింది ఇతగాడే. మిణుగురులు, టామీ వంటి సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించాడు. ఇతగాడిలో మరో సర్టిఫికేట్ కూడా వుంది. అదే సత్యానంద్ శిష్యరికం. టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ లాంటి వారితో సత్యానంద్ దగ్గర నటనలో ఓనమాలు దిద్దిన దీపక్ సరోజ్ ఎట్టకేలకు వందనం సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పరిశ్రమలో ఇతగాడి భవితవ్యం ఏమిటన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుంది.
Tags:    

Similar News