ఫేస్ బుక్ లో డార్లింగ్ సౌత్ నంబర్ -1
ప్రభాస్ అన్న పేరే ఒక ప్రభంజనం. బాహుబలి సిరీస్ సక్సెస్ తెచ్చిన మానియా ఇది. ఆ ప్రభావం అంతా ఇంతా కాదు. అతడి రేంజ్ అమాంతం పెరిగింది. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభాస్ కి అభిమానులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. జపాన్- మలేషియా- ఆస్ట్రేలియా- గల్ఫ్ దేశాల్లోనూ ప్రభాస్ కి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాల్లోనూ ప్రభాస్ క్రేజు అంతకంతకు పెరుగుతోంది. ఇటీవలే ఇన్ స్టాగ్రమ్ లో చేరి అక్కడ అసాధారణంగా ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు. ఇన్ స్టాలో కేవలం 65 పోస్టులకే 50లక్షల ఫాలోవర్స్ చేరారు.
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లోనూ ప్రభాస్ మానియా కొనసాగుతోంది. ఇతర మాధ్యమాలతో పోలిస్తే ఫేస్ బుక్ లో ప్రభాస్ తొలి నుంచి యాక్టివ్ గానే ఉన్నాడు. ఇప్పటికే కోటి 60లక్షల మంది (16 మిలియన్లకు పైగా) ఫాలోవర్లు ఉన్నారు. ఈ మాధ్యమంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ స్టార్ గా అతడి పేరు చరిత్రకెక్కింది. 16 మిలియన్ల మంది ఫాలోవర్స్ క్లబ్ లోకి ప్రవేశించిన తొలి టాలీవుడ్ నటుడిగా డార్లింగ్ రికార్డులకెక్కాడు.
1 మిలియన్ ఫాలోవర్స్ నుండి 16 మిలియన్ల మందికి చేరుకోవడానికి రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఎక్కువ సమయం పట్టలేదు. ఇటీవల కేవలం 6 రోజుల్లో 1 మిలియన్ (10లక్షలు) మంది చేరారంటేనే అర్థం చేసుకోవచ్చు. బాహుబలి తర్వాత సాహో రిలీజ్ ముందు ఫాలోవర్స్ అసాధారణంగా పెరిగారు. ఇప్పుడు రాధే శ్యామ్ (ప్రభాస్ 20) రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఆ క్రమంలోనే లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. తాజా చిత్రం రాధే శ్యామ్ పీరియడ్ రొమాంటిక్ డ్రామా. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.